KKR vs RR Preview: దిగ్గజాల పోరుకు సిద్ధమైన ఈడెన్ గార్డెన్స్.. టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..

Kolkata Knight Riders vs Rajasthan Royals, 31st Match: IPL 2024 31వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మంగళవారం సాయంత్రం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాత్రి 7.30 నుంచి జరగనుంది. టేబుల్‌ టాపర్‌గా నిలవడం కోసం ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ హోరాహోరీగా సాగనుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్‌లలో 5 గెలిచింది. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

KKR vs RR Preview: దిగ్గజాల పోరుకు సిద్ధమైన ఈడెన్ గార్డెన్స్.. టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
Kkr Vs Rr Preview
Follow us

|

Updated on: Apr 16, 2024 | 11:45 AM

KKR vs RR IPL 2024 Preview: IPL 2024 31వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మంగళవారం సాయంత్రం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాత్రి 7.30 నుంచి జరగనుంది. టేబుల్‌ టాపర్‌గా నిలవడం కోసం ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ హోరాహోరీగా సాగనుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్‌లలో 5 గెలిచింది. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 5 మ్యాచ్‌లలో 4 గెలిచి, 8 పాయింట్లతో కేకేఆర్ రెండవ స్థానంలో ఉంది. KKR నికర రన్ రేట్ (1.688) కలిగి ఉంది. ఇది రాజస్థాన్ (0.767) కంటే మెరుగ్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సొంతగడ్డపై రాజస్థాన్‌ను ఓడించి కేకేఆర్‌ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఎందుకంటే అప్పుడు రెండు జట్లూ 10-10 పాయింట్లు సమానంగా ఉంటాయి. విజయం కారణంగా, KKR రన్ రేట్ మరింత మెరుగవుతుంది.

రాజస్థాన్, కోల్‌కతా జట్లు రెండూ తమ తమ గత మ్యాచ్‌లలో విజయం సాధించాయి. కోల్‌కతా లక్నో సూపర్ జెయింట్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో, రాజస్థాన్ రాయల్స్ గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. రెండు జట్లూ గెలుపు రికార్డును నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

సునీల్ నరైన్ కేకేఆర్ ట్రంప్ కార్డ్..

IPL 2024లో ఇప్పటివరకు KKRకి సునీల్ నరైన్ ట్రంప్ కార్డ్ అని నిరూపించాడు. బంతితోనూ, బ్యాటింగ్‌తోనూ అద్భుతాలు చేస్తున్నాడు. ఈ సీజన్‌లో అతను చాలా పొదుపుగా రాణిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 19 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అదే సమయంలో లక్నో సూపర్ జెయింట్‌పై నరైన్ 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతని బౌలింగ్‌లో బౌండరీలు కొట్టడం బ్యాట్స్‌మెన్‌కు కష్టమని తేలింది. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌లను భయపెడుతున్నాడు.

ఇటువంటి పరిస్థితిలో రాజస్థాన్ రాయల్స్‌పై శ్రేయాస్ అయ్యర్‌కు నరైన్ ముఖ్యమైన ఆయుధంగా మారిపోయాడు. రాజస్థాన్‌లో సంజు శాంసన్, ర్యాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్ వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. భారీ షాట్లు కొట్టడంలో నిపుణుడు. అయితే నరైన్ స్పిన్‌ను ఎదుర్కోవడం అతనికి అంత సులభం కాదు. ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ ఆడుతాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

స్టార్క్ కూడా ఫామ్‌లోకి..

మిచెల్ స్టార్క్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. ఇది కోల్‌కతాకు బలాన్ని ఇస్తుంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 2 ముఖ్యమైన వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో మొత్తం 3 వికెట్లు తీశాడు. ఇది KKR బౌలింగ్‌కు మరింత డెప్త్‌ను జోడించింది.

దంచికొడుతోన్న కేకేఆర్ ప్లేయర్స్..

ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ కేకేఆర్‌కు టాప్ ఆర్డర్‌లో పవర్ ఫుల్ జోడీగా మారారు. ఆండ్రీ రస్సెల్ కూడా పెద్ద షాట్లు కొట్టగలడు. కానీ, రాజస్థాన్ రాయల్స్‌లో కూడా మంచి బౌలర్లు ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్‌తో పాటు అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ రాణిస్తున్నారు. ఆర్ అశ్విన్ ఫిట్‌గా ఉంటే అతను కూడా ఆడగలడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.

రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు మొత్తం 28 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కేకేఆర్‌ 14, రాజస్థాన్‌ 13 గెలుపొందాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..