ప్రొటీన్లు, విటమిన్లు వంటి ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉండే మునగ ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా మూడు పదులు దాటిన మహిళల్లో ఎముక సాంద్రతకు, ఎదిగే పిల్లల్లో ఎముకల బలానికి మునగ ఎంతో తోడ్పడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో మునగాకు, మునక్కాయలను చేర్చుకుంటే శరీరానికి కావలసినంత క్యాల్షియం అందుంతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.