- Telugu News Photo Gallery Technology photos Amazon offering huge discount on iphone 15 click here for full details
iPhone 15: ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్ కొనుగోలు చేయాలనేది చాలా మందికి ఉండే డ్రీమ్. ఇందులోని ఫీచర్లు, సెక్యూరిటీ ఆప్షన్స్ ఈ ఫోన్‌పై క్రేజ్ పెరగడానికి కారణాలుగా చెప్పొచ్చు. అయితే ధర చూసే చాలా మంది కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఐఫోన్ లవర్స్ కోసం ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ భారీ డీల్‌ను అందిస్తోంది. ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఏంటా డీల్.? ఎంత డిస్కౌంట్ లభించనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 16, 2024 | 10:51 AM

ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 79,900గా ఉంది. అయితే అమెజాన్‌లో ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ రూ. 72,690కి లభిస్తుంది. అలాగే ఈ ఫోన్‌పై రూ. 7210 ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తున్నారు. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 6000 డిస్కౌంట్ పొందొచ్చు.

ఇలా అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఈ ఫోన్‌ను రూ. 66,900కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదు మీ దగ్గర ఉన్న పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంఆ రూ. 27,550 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఐఫోన్ 15ని మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఐఫోన్ 15 ప్రో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. అలాగే ఇందులో మెరుగైన గేమింగ్ అనుభవాన్ని, స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తున్నారు.

ఐఫోన్ 15 ప్రో సిరీస్‌లో 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 26 గంటలపాటు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. యూఎస్‌బీ టైప్‌సీ కేబుల్‌ను అందించారు.

ఏ16 బయోనిక్ చిప్, 6 కోర్ సీపీయు ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్‌ను అందించారు. సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.




