- Telugu News Photo Gallery Business photos These are the best portable fans with low price, check details in telugu
Portable Fans: అరచేతిలో ఇమిడిపోయే ఫ్యాన్లు ఇవి.. ఈజీగా ఎక్కడికైనా పట్టుకెళ్లొచ్చు..
వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం 10 గంటలు దాటితే బయటకు రాలేని పరిస్థితి ఉంది. ప్రజలందరూ ఇళ్లలో ఏసీలు వేసుకుని సేదతీరుతున్నారు. అయితే ఉద్యోగ బాధ్యతలు, అత్యవసర పనులపై కొందరు బయట తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఎండ కారణంగా వీరందరూ ఏసీ కార్లు బుక్ చేసుకుని ప్రయాణించే వీలు ఉండదు. అలాగని సాధారణ బస్సులు, ఆటోలలో ప్రయాణిస్తే ఉక్కబోతతో ఇబ్బందులు పడతారు. అలాగే ఎప్పుడైనా ఇంట్లో కరెంట్ కట్ అయినా అవస్థలు తప్పవు. ఇలాంటి వారి కోసమే పోర్టబుల్ మినీ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని తమతో పాటు చాలా సులభంగా తీసుకువెళ్లవచ్చు. చార్జింగ్ చేసుకునే వీలు కలిగిన ఈ ఫ్యాన్లు కేవలం రూ.1000 లోపు ధరకే అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. వాటి ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.
Updated on: Apr 17, 2024 | 7:37 AM

యునిక్ మినీ పోర్టబుల్ ఫ్యాన్(UNIQUE mini portable fan).. ఈ హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్ కేవలం రూ. 799 ధరలో అందుబాటులో ఉంది. పింక్, గ్రీన్, బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. దీనిలోని నాలుగు అంగుళాల బ్రష్ లెస్ మోటార్ తో గాలి వేగంగా వీస్తుంది.. గాలి వేగం నియంత్రణకు లో, మీడియం, హై లెవెల్ స్పీడ్ ఆప్షన్లు ఉన్నాయి. దీనిలోని 1800 ఎంఏహెచ్ లిథియం బ్యాటరీని ఎప్పటికప్పుడు చక్కగా చార్జింగ్ చేసుకోవచ్చ. మొదటి స్పీడ్ సెట్టింగ్‌లో ఐదు గంటలు, రెండో స్పీడ్ సెట్టింగ్‌లో మూడు గంటల వరకూ పనిచేస్తుంది.

వన్ 94 స్టోర్ మినీ పోర్టబుల్ హ్యాండ్ ఫ్యాన్(One94store mini portable hand fan).. పింక్, వైట్, ఎల్లో, బ్లాక్ రంగులలో ఆకర్షణీయంగా ఉన్న ఈ హ్యాండ్ ఫ్యాన్ ధర కేవలం రూ.749. దీనిలోని బ్రష్ లెస్ మోటారు నుంచి గాలి స్థిరంగా వేగంగా వీస్తుంది. ఈ ఫ్యాన్ లోని లో, మీడియం, హై లెవెల్ సెట్టింగ్ లు చాలా ఉపయోగంగా ఉంటాయి. దీనిలో 2,000ఎంఏహెచ్ లిథియం బ్యాటరీ అమర్చారు.

గయాటాప్ మినీ పోర్టబుల్ ఫ్యాన్(Gaiatop mini portable fan).. ఈ పోర్టబుల్ ఫ్యాన్ లో యూఎస్ బీ పోర్ట్ ను ఉపయోగించి చార్జింగ్ చేసుకోగల రీచార్జిబుల్ బ్యాటరీ ఉంది. పింక్, ఎల్లో, వైట్, ఆలివ్ డ్రాబ్, బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీనిలో కాపర్ బ్రష్‌లెస్ మోటార్ ఏర్పాటు చేశారు. అలాగే మూడు రకాల స్పీడ్ సెట్టింగ్ లు ఉన్నాయి. ఈ ఫ్యాన్ ధర రూ. 799.

డెరికే పోర్టుబుల్ రిచార్జ్ బుల్ నెక్ ఫ్యాన్(DERIKE portable rechargeable Neck fan).. ఇది మెడలో వేసుకునే నెక్ ఫ్యాన్. ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసుకునేటప్పుడు కూడా చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. ఈ ఫ్యాన్ రూ.599కు అందుబాటులో ఉంది. బ్లేడ్‌లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. 360 డిగ్రీల కోణంలో గాలిని అందించేందుకు 62 ఎయిర్‌ఫ్లో అవుట్‌లెట్లు ఏర్పాటు చేశారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 10 నుంచి 12 గంటల వరకూ పనిచేస్తుంది. టైప్ సీ పోర్ట్ ద్వారా ఈ నెక్ ఫ్యాన్ ను చార్జింగ్ చేసుకోవచ్చు.

గయాటాప్ మినీ హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్(Gaiatop mini Handheld fan).. ఈ ఫ్యాన్ ను ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకువెళ్లే వీలు ఉంది. దీనిని మడతపెట్టి జేబులో పెట్టుకోవచ్చు. మహిళలైతే సులభంగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు. యూఎస్ బీ పోర్ట్ ద్వారా చార్జింగ్ చేసుకునే సౌకర్యంగా ఉంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 24 గంటల పాటు పనిచేస్తుంది. దీని కేవలం ధర రూ.629.




