Mango Rasam Recipe: చల్లదన్నాని ఇచ్చే టేస్టీ టేస్టీ మామిడి కాయ రసం తయారీ విధానం
Mango Rasam Recipe: వేసవి కాలం వచ్చిందంటే.. మామిడి కాయల సందడి మొదలవుతుంది. పచ్చిగా ఉన్నప్పుడు మామిడి కాయను పప్పు, కూరగా చేసుకుంటాము.. అయితే మామిడి కాయతో ఎంతో రుచికరమైన రసం కూడా...
Mango Rasam Recipe: వేసవి కాలం వచ్చిందంటే.. మామిడి కాయల సందడి మొదలవుతుంది. పచ్చిగా ఉన్నప్పుడు మామిడి కాయను పప్పు, కూరగా చేసుకుంటాము.. అయితే మామిడి కాయతో ఎంతో రుచికరమైన రసం కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు మామిడికాయ రసం తయారీ గురించి తెలుసుకుందాం..!
కావాల్సిన పదార్థాలు:
పుల్లని మామిడికాయ -1 కందిపప్పు- 1 కప్పు పచ్చి మిర్చి – 4, కరివేపాకు – 2 రెమ్మలు, ఉప్పు – రుచికి సరిపడా నూనె – తగినంత, నీళ్లు- 3 గ్లాసులు, రసం పౌడర్ – టేబుల్ స్పూన్ (మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు కలిసిన పొడి) ఆవాలు మినప్పప్పు జీలకర్ర పసుపు బెల్లం తరుగు కొత్తిమీర
తయారీ విధానం:
ముందుగా కందిపప్పుని బాణలి లో వేసి.. దోరగా స్మెల్ వచ్చేవరకూ వేయించాలి. తర్వాత ఆ పప్పుని కడిగి, మామిడి ముక్కలు, రెండు కప్పుల నీళ్లు పోసి 5 విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. పప్పు ఉడికిన తర్వాత మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో నూనె పోసి కాగబెట్టాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. అవి చిటపటలాడాక, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత 3 కప్పుల నీళ్లు పోసి పసుపు, బెల్లం తరుగు, ఉప్పు, రుబ్బిన పప్పు పోసి ఉడికించాలి. తర్వాత రసం పౌడర్ వేసి మరో రెండు మూడు నిమిషాల పాటు మరగనివ్వాలి. చివర్లో కొత్తిమీర చల్లి దింపెయ్యాలి. రుచికరమైన ఆరోగ్యమైన మామిడి రసం రెడీ..
Also Read: సాప్ట్ వేర్ జాబ్ వదిలి చెరువులో ముత్యాలు పండిస్తూ.. లక్షలను ఆర్జిస్తున్న యువకుడు ఎక్కడంటే..!
వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..! ఈ చిట్కాలు పాటించి చూడడండి.. రిలీఫ్ పొందండి..