Pearl Farming: సాప్ట్ వేర్ జాబ్ వదిలి చెరువులో ముత్యాలు పండిస్తూ.. లక్షలను ఆర్జిస్తున్న యువకుడు ఎక్కడంటే..!

Pearl Farming: చాలామంది చెరువుల్లో చేపలు, రొయ్యలు, పీతలను పెంచుతారు. నలుగురికి నచ్చింది నాకు అసలు నచ్చదు.. నా రూటే సెపరేటు అనుకున్నాడు ఓ యువకుడు.. అందుకనే డిఫరెంట్ గా..

Pearl Farming: సాప్ట్ వేర్ జాబ్ వదిలి చెరువులో ముత్యాలు పండిస్తూ.. లక్షలను ఆర్జిస్తున్న యువకుడు ఎక్కడంటే..!
Pearl Farmin
Follow us
Surya Kala

|

Updated on: Apr 09, 2021 | 11:57 AM

Pearl Farming: చాలామంది చెరువుల్లో చేపలు, రొయ్యలు, పీతలను పెంచుతారు. నలుగురికి నచ్చింది నాకు అసలు నచ్చదు.. నా రూటే సెపరేటు అనుకున్నాడు ఓ యువకుడు.. అందుకనే డిఫరెంట్ గా ఆలోచించాడు.. తాను చేస్తున్న సాఫ్ట్ వేర్ జాబ్ ని వదిలి వ్యవసాయం లోకి వచ్చాడు. అదీ ఆహారధాన్యాలనో.. కూరగాయలనో పండించడానికి కాదు.. ముత్యాలను పండించడం ప్రారంభించాడు. ఇప్పుడు లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.. ఆ యువకుడిది బీహార్ …. వివరాల్లోకి వెళ్తే..

బీహార్ లోని చంపారన్ జిల్లాలోని మురేరా గ్రామానికి చెందిన నిటిల్ భరద్వాజ్ ని వ్యవసాయ కుటుంబం.. అయితే చదువుకున్న నిటిల్ఢిల్లీలోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేశాడు. 2017లో అతను కంప్యూటర్ ప్రొఫెషనల్‌గా కెరీర్ ప్రారంభించాడు. నెలకు రూ.30వేల జీతం.. అయితే ఒకేసారి తండ్రి మాటల్లో ముత్యాల వ్యవసాయం గురించి వచ్చింది. అంతే దానిపై ఆసక్తి కలిగింది నిటిల్ కు.. వెంటనే ముత్యాల వ్యవసాయం గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు.. మధ్య ప్రదేశ్ లోని పెరల్ ఫామ్‌లో ముత్యాల వ్యవసాయం కోసం శిక్షణ తీసుకున్నాడు.

దీంతో నిటిల్ తన స్వగ్రామంలో ముత్యాల వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. ముత్యాల పెంపకంలో భాగంగా 2019లో తన వద్ద ఉన్న స్థలంలో చిన్న కొలను ఏర్పాటు చేసి అందులో 400 గుల్లలను పెంచడం మొదలు పెట్టాడు. తరువాత క్రమంగా వాటి సంఖ్య పెరిగింది. ఎకరం చెరువులో సుమారుగా 30వేల వరకు గుల్లలను పెంచడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అతను మొదట్లో రూ.25వేలు పెట్టుబడి పెట్టాడు. మొదటి ప్రయత్నంలోనే .. రూ 75 వేల లాభాన్ని సంపాదించాడు.. దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరింత కేరింగ్ గా ముత్యాల వ్యవసాయం చేసాడు.. ఇక నిటిల్ వెనక్కి తిరిగి చూడలేదు. అంతేకాదు.. కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి పని కల్పించేందుకు గాను ఓ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. దాని ద్వారా శిక్షణ అందించి నిరుద్యోగులు, కార్మికులకు ఉపాధి కల్పించడం మొదలు పెట్టాడు

ముత్యాల వ్యవసాయంలో ఒక ఆల్చిప్పకు రూ.40 పెట్టుబడి అవుతుంది. అందులో రెండు ముత్యాలు వస్తాయి. ఒక్కో దాన్ని రూ.120 కు అమ్మవచ్చు. మంచి నాణ్యత ఉంటే ముత్యం ధర రూ.200 వరకు పలుకుతుంది. ఇది లాభాలను తెచ్చి పెడుతుంది. ఈ క్రమంలోనే అతను ఇప్పటి వరకు రూ.3.60 లక్షలను సంపాదించాడు. త్వరలోనే మరిన్ని ముత్యాలను ఉత్పత్తి చేసేలా చెరువులను మరింత విస్తరించి మరో కొంతమందికి పని కల్పిస్తానని అంటున్నాడు. అంతేకాదు.. ఎవరైనా కష్టం అని అనుకోకుండా పనిచేస్తే.. ముత్యాల వ్యవసాయంలో లాభాలు ఆర్జించ వచ్చు అని చెబుతున్నాడు. తన వద్దకు వస్తే వ్యవసాయం ఎలా చెయ్యాలో నేర్పిస్తాఅంటున్నాడు. నిటిల్

Also Read: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..! ఈ చిట్కాలు పాటించి చూడడండి.. రిలీఫ్ పొందండి..

అనుమానం పోకుండా అభిమానం ఎలా వస్తుంది.. నేను డాక్టర్‌బాబుని నమ్మను అంటున్న భాగ్యం..