Back Pain Relief: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..! ఈ చిట్కాలు పాటించి చూడడండి.. రిలీఫ్ పొందండి..

Back Pain Relief: ప్రస్తుతం మనం తినే తిండి.. పనుల ఒత్తిడి.. జీవన విధానంతో చిన్న వయస్సులోనే అనేక వ్యాధుల బారిన పడుతున్నాం.. ఇక ప్రస్తుతం తరచుగా వినిపించే మాట... వెన్ను నొప్పి.. ఎక్కువ మంది వెన్ను సమస్యతో...

Back Pain Relief: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..! ఈ చిట్కాలు పాటించి చూడడండి.. రిలీఫ్ పొందండి..
Back Pain
Follow us
Surya Kala

|

Updated on: Apr 09, 2021 | 12:50 PM

Back Pain Relief: ప్రస్తుతం మనం తినే తిండి.. పనుల ఒత్తిడి.. జీవన విధానంతో చిన్న వయస్సులోనే అనేక వ్యాధుల బారిన పడుతున్నాం.. ఇక ప్రస్తుతం తరచుగా వినిపించే మాట… వెన్ను నొప్పి.. ఎక్కువ మంది వెన్ను సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు ముఖ్య కారణం లైఫ్ స్టైల్ లో చోటు చేసుకున్న మార్పులు. ముఖ్యంగా కూర్చునే భంగిమ సరిగా లేకపోతె వెన్నె సమస్య అధికంగా వచ్చే అవకాశం ఉంది.  అయితే వెన్ను సమస్యలు ఎందుకు వస్తాయి. వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు ఈరోజు తెలుసుకుందాం..!

సరైన పోశ్చర్‌ మెయింటైన్ చేయకపోతే, వెన్నెముక పెళుసుగా మారి ఈజీగా దెబ్బతింటుంది. ఈ విషయం మనకు తెలియకుండానే జరిగిపోతుంది. కనుక ప్రతిరోజూ రెగ్యులర్‌గా మనం చేసే కార్యక్రమాలలో సరైన భంగిమలో శరీరాన్ని ఉంచడం చాలా అవసరం.

ఇక అధిక బరువు కూడా వెన్నెపై ప్రభావం చూపుతుంది. ఇక మహిళల్లో హీల్స్‌ అలవాటు కూడా వెన్నెపై ప్రభావం చూపిస్తుంది. అందుకనే ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవడం, నిల్చోవడం చేయకుండా శరీరాన్ని అప్పుడప్పుడు కదిలించాలి. కంప్యూటర్, టీవీ వంటివి చూసేటప్పుడు లేదా టేబుల్‌ మీల్స్‌ చేసేటప్పుడు మెడను సరైన ఎత్తులో ఉంచుకోవడం ద్వారా మెడపై భారం లేకుండా చూసుకోవాలి. ఇక నిల్చున్న సమయంలో తల ముందుకు ఉంచాలి.. వీపు నిటారుగా ఉండాలి ఇలా చేస్తే.. వెన్నె పై ప్రభావం తగ్గుతుంది.

ఇక ప్రతిరోజూ కూర్చుని నిలబడటం, సైకిల్ తొక్కడం వంటి సరళమైన జీవనశైలి మార్పులు దీనికి ఎంతో దోహదపడతాయి. ​ఫోన్ వాడే సమయంలో… మొబైల్‌ను కంటికి సమాన దూరంలో ఉంచాలి .. వీపు నిటారుగా ఉండాలి. భుజాలు, తలను తిన్నగా ఉంచాలి.. ఇక డ్రైవింగ్ సమయంలో కూడా బ్యాక్ కు సపోర్ట్ పెట్టుకుని వెన్నును నిటారుగా ఉంచాలి. వెన్నును వెనక్కి ఉంచి కారు స్టీరింగ్ చక్రాన్ని భుజాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు ముందు కుర్చీలో నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోండి. వెన్నెముక నిటారుగా లేకపోతే పొట్ట వస్తుంది. కొన్ని సార్లు వెన్నెముకలో నొప్పి కూడా వస్తుంది.

ఇక ఎక్కువ సమయం కూర్చోవాల్సి వచ్చినప్పుడు కొంత విరామం తీసుకుని కాళ్లు, చేతులు, మెడను సవ్య, అపసవ్య దిశల్లో నెమ్మదిగా తిప్పాలి. ఇలా 10-15 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇదే విధంగా భుజాలు, చేతుల్ని కూడా పైకి, కిందకు గుండ్రంగా, వ్యతిరేక దిశలో తిప్పడమూ చక్కటి వ్యాయామమే అవుతుంది. వెన్ను సమస్యలను ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.. ప్రతిరోజూ కూర్చుని నిలబడటం, సైకిల్ తొక్కడం వంటి సరళమైన జీవనశైలి మార్పులు దీనికి ఎంతో దోహదపడతాయి.. మన ఆరోగ్యం మనచేతుల్లోనే ఉంది..

Also Read:  : అనుమానం పోకుండా అభిమానం ఎలా వస్తుంది.. నేను డాక్టర్‌బాబుని నమ్మను అంటున్న భాగ్యం..

: బెంగాల్ లో పెరుగుతున్న ఎన్నికల ఘర్షణలు..బీజేపీ అభ్యర్థి సహా 15 మంది మద్దతు దారులకు తీవ్ర గాయాలు