Coronavirus Second Wave: విజృంభిస్తున్న కరోనా.. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చిట్కాలు ఇవే..
Coronavirus Second Wave:ప్రపంచం తో పాటు మనం కూడా ఒక సంవత్సరానికి పైగా కోవిడ్ 19 కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం..
Coronavirus Second Wave: ప్రపంచం తో పాటు మనం కూడా ఒక సంవత్సరానికి పైగా కోవిడ్ 19 కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. మనకు అనారోగ్యాన్ని కలిగించే సూక్ష్మక్రిములు , కణాల మార్పుల నుండి మన శరీరాన్ని రోగనిరోధక శక్తి రక్షిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు తప్పని సరిగా కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మంచి నిద్ర :
రోగనిరోధక శక్తిని కాపాడుకోవడంలో తగినంత నిద్ర పోవడం చాలా ముఖ్యం. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, తగినంత విశ్రాంతి , నిద్ర .. సహజంగానే రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం :
ప్రతి ఒక్కరిలోనూ రోగనిరోధక శక్తి పెంపొందించడంలో ఆహారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. హానికరమైన వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడే పోషకాలు , యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, విత్తనాలు, చిక్కుళ్ళు, మొలకెత్తిన విత్తనాలు ఆహారంగా తీసుకోవాలి. ఇక ఆలివ్ నూనె, సాల్మన్ మొదలైన వాటిలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వు రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా , వైరస్ తో పోరాడటానికి సహాయపడతాయి.
వ్యాయామం :
క్రమం తప్పకుండా చేసే వ్యాయామం శరీరం మనసు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. అందుకని రెగ్యులర్ గా చేసే వ్యాయామం రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి పోత్సాహకారంగా నిలుస్తుంది.
మంచినీరు:
శరీరం ఆరోగ్యంగా ఉండడంలో ముఖ్య పాత్ర మీరు తాగే నీరు పోషిస్తుంది. నిర్జలీకరణం అజీర్ణం, తలనొప్పి, శారీరక పనితీరు, మూత్రపిండాల పనితీరు సమస్యలు వంటి అనేక సమస్యల నుంచి మనం తాగే నీరు రక్షణ కల్పిస్తుంది.
ఒత్తిడిని అధిగమించడం:
శరీరంలోని రోగనిరోధక శక్తి పై ఆందోళన ప్రభావం చూపిస్తుంది. అందుకనే ఆందోళన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి.. రోగనిరోధక కణాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.. కణాల అసమతుల్యతను పెంచుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, నృత్యం, ఓదార్పు సంగీతాన్ని వినడం వంటి పద్ధతుల ద్వారా ఒత్తిడి స్థాయిని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
రెగ్యులర్ హెల్త్ చెకప్:
ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకోవాలని సూచిస్తున్నారు. హెల్త్ చెకప్ కోసం సమయం తప్పని సరిగా కేటాయించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఆస్తమా, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటివి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి .. తద్వారా అంటువ్యాధుల వ్యాపించే అవకాశం అధికంగా ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు
Also Read: మన రక్షణ మనచేతుల్లోనే ఉంది.. తలలు వెనక్కి జరిపి.. మాస్కులు ధరించండి..ఆనంద్ మహీంద్రా ట్వీట్
సాప్ట్ వేర్ జాబ్ వదిలి చెరువులో ముత్యాలు పండిస్తూ.. లక్షలను ఆర్జిస్తున్న యువకుడు ఎక్కడంటే..!