Covid 19 Pandemic: మన రక్షణ మనచేతుల్లోనే ఉంది.. తలలు వెనక్కి జరిపి.. మాస్కులు ధరించండి..ఆనంద్ మహీంద్రా ట్వీట్
Covid 19 Pandemic: కొంతమంది వ్యక్తులు తమ జీవితం , తమ వ్యాపారం అంటూ తమకోసం మాత్రమే ఆలోచిస్తారు.. అలాగే జీవిస్తారు.. అయితే ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా మాత్రం అందుకు భిన్నం.. సమాజం కోసం..
Covid 19 Pandemic: కొంతమంది వ్యక్తులు తమ జీవితం , తమ వ్యాపారం అంటూ తమకోసం మాత్రమే ఆలోచిస్తారు.. అలాగే జీవిస్తారు.. అయితే ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా మాత్రం అందుకు భిన్నం.. సమాజం కోసం.. సాటి మనుషుల కోసం ఆలోచిస్తారు.. కొంతమందితోనైనా అలా ఆలోచింపజేసేవిధంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసే పోస్టులు నవ్వించేవి కొన్నైతే.. మనిషిలోని మానవత్వాన్ని తట్టిలేపేవి కొన్ని ఉంటాయి. కొన్ని ఆలోచింపజేసేవి ఇలా అనేక అంశాలు ఉంటాయి. ఇక ప్రపంచంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆయన అనేక అంశాలతో కూడిన పోస్టులను షేర్ చేశారు..
ఇండియాలో సెకండ్ వేవ్ మొదలై.. మళ్ళీ కరోనా కేసులు విజృభిస్తున్న వేళ.. ప్రజల్లో నిర్లక్ష్యం ఏ రేంజ్ లో ఉందొ చుడండి అంటూ.. ఓ పిక్ ని తన ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.. కొన్ని ఆఫీసుల్లో .. ఉద్యోగులు ప్రజలకు మధ్య సేవలను అందించడానికి మాట్లాడానికి గ్లాస్ వాల్ కు మధ్య ఓ రంధ్రం ఉంటుంది. బయట ఉన్న ఓ వ్యక్తి.. ఆ రంధ్రంలో తల పెట్టి మరీ లోపల ఉన్న ఉద్యోగితో మాట్లాడుతున్నాడు.. ఆ ఫోటోని ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఆ ఫోటో లో ఉన్న ఇద్దరి మధ్య భౌతిక దూరం పక్కన పెడితే.. కనీసం ఇద్దరూ మాస్కులు కూడా ధరించలేదు.. దీంతో ఆ ఫోటో లో ఉన్న వ్యక్తుల నిర్లక్ష్యానికి అసహనం వ్యక్తం చేశారు. కరోనా నివారణకు మనం తప్పని సరిగా మాస్కులు ధరించాలి.. భౌతిక దూరం పాటించాలి.. ఇవేమీ మనకి ఇంకా అలవాటు అవ్వలేదు అని ఈ ఫోటో చూస్తే అర్ధం అవుతుంది.. మనం నిబంధనలు పాటించాల్సిన సమయం ఇది.. మన స్వీయ రక్షణ మన చేతుల్లోనే ఉంది.. తలలు వెనక్కి జరిపి.. మాస్కులు ధరించండి అంటూ.. ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. ఇక ఇదే ఫోటో ను బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ కూడా ఈ చిత్రాన్ని షేర్ చేసి, ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.
కరోనా సృష్టిస్తున్న కల్లోలం నుంచి బయటపడేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రం చేపట్టిన ప్రభుత్వానికి ప్రజల సహకారం తప్పని సరి. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ.. కరోనా విజృభనకు అడ్డుకట్ట వేసేందుకు మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండంటూ ప్రభుత్వాలు, వైద్య నిపుణులు కోరుతున్నారు. ఐతే చాలా మంది మాస్క్ లు ధరించే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని.. అందుకనే భారీగా కేసులు నమోదవుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన చిత్రంలోని వ్యక్తులకు ఆ విషయాలేవీ చెవికెక్కినట్టు లేదు. అందుకే భౌతిక దూరానికి కూడా షార్ట్ కట్ వెతుకున్నారని కొంతమంది నెటిజన్లు మండి పడుతున్నారు.
Clearly, we’re not accustomed to social distancing. But it’s time to do our bit: pull our heads back and mask up! pic.twitter.com/cqK9apinMq
— anand mahindra (@anandmahindra) April 7, 2021
Also Read: పనిచేసే కార్మికుడితో సరదాగా ఆటలు ఆడిన అల్లరి గున్న ఏనుగు.. ఎవరు గెలిచారంటే..!