Rahul Gandhi: వ్యాక్సినేషన్ తో ‘పండగ’ చేసుకోవడం కాదు.. రాష్ట్రాలకు సక్రమంగా పంపండి..రాహుల్ గాంధీ  తీవ్ర వ్యాఖ్యలు 

కరోనా వ్యాక్సినేషన్ పై రాజకీయంగా దుమారం రేగుతోంది. ప్రధాని మోడీ టీకా ఉత్సవానికి పిలుపు ఇవ్వడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడుతున్నారు.

Rahul Gandhi: వ్యాక్సినేషన్ తో 'పండగ' చేసుకోవడం కాదు.. రాష్ట్రాలకు సక్రమంగా పంపండి..రాహుల్ గాంధీ  తీవ్ర వ్యాఖ్యలు 
Rahul Gandhi
KVD Varma

|

Apr 09, 2021 | 12:55 PM

Rahul Gandhi: కరోనా వ్యాక్సినేషన్ పై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే భారత ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో ఎటువంటి ఇబ్బందీ లేదని ప్రకటించింది. మరింత వేగంగా వ్యాక్సినేషన్ చేయడానికి వీలుగా ఈనెల 11 నుంచి 14 వరకూ ‘టీకా ఉత్సవ్’ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ”వ్యాక్సిన్ సరిపడేంత లేకపోవడం ఉత్సవం కాదు” అంటూ శుక్రవారం ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ.

దేశంలో వ్యాక్సిన్ లభ్యత తక్కువగా ఉందనీ.. ఈ దశలో వ్యాక్సిన్ ఎగుమతులు జరపడమేమిటని అయన ప్రశ్నిస్తున్నారు. ”రాష్ట్రాలన్నిటికీ తగినంత వ్యాక్సిన్ సరఫరా జరిగేలా చూడాలి. మేమంతా ఈ కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు అండగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాం” అని చెప్పారు. దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వకుండా విదేశాలకు ఎగుమతులు ఎందుకు చేస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు.

వ్యాక్సిన్ లభ్యత అన్ని ప్రాంతాల్లోనూ సరిగా లేదు. ఈ సమయంలో అందరికీ వ్యాక్సిన్ చేరేలా చూడాలి కానీ, ఉత్సవాలు చేసుకుంటారా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం-బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటీవల వ్యాక్సిన్ వివాదం రేగింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కు చెందిన నేతలు కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాలకు వ్యాక్సిన్ సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తమ రాష్ట్రాల్లో బీజీపీ అధికారంలో లేనందున వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి రాజేష్ తోపే గుజరాత్ లో ప్రజలు ఎంత మంది ఉన్నారో అన్ని వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచారు. అని ఆరోపించారు. దానికి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమాధానం ఇస్తూ మహారాష్ట్ర, రాజస్తాన్ లకు పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ పంపించాం. అవి రెండూ బీజేపీ యేతర రాష్ట్రాలే కదా అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తాజా కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Also Read: West Bengal polls : నేను బెంగాల్‌ ఆడపులిని.. భయపడి తలవంచబోనన్న మమతా బెనర్జీ

సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ దార్శనికత, ఇచ్చిన వాగ్దానాలను.. ఇలా నిలబెట్టుకున్నానంటూ జగన్ లేఖ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu