కరోనా వైరస్ ఆహారంపై ఎంతకాలం ఉంటుంది..? పేపర్‌, కూరగాయలు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

Caronavirus Stay on Food : రోజు రోజుకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తూ ఆంక్షలు విధించినా ఫలితం లేకుండాపోతుంది.

కరోనా వైరస్ ఆహారంపై ఎంతకాలం ఉంటుంది..?  పేపర్‌, కూరగాయలు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!
Caronavirus Stay On Food
Follow us
uppula Raju

|

Updated on: Apr 09, 2021 | 5:50 AM

Caronavirus Stay on Food : రోజు రోజుకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తూ ఆంక్షలు విధించినా ఫలితం లేకుండాపోతుంది. మరోవైపు వైరస్ గాలిలో, వస్తువులపై, ఆహార పదార్థాలపై ఎక్కడ పడితే అక్కడ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం నిత్యం వాడే కూరగాయలు, న్యూస్‌ పేపర్ తదితర వస్తువులపైన కూడా కరోనా ఉంటుంది. అలాంటప్పుడు దాని భారిన పడుకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనావైరస్‌కు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలైన పార్కులు, మాల్స్, వీధుల్లో రక్షణ దుస్తులు వేసుకుని ఫాగ్ స్ప్రే చేస్తున్నారు. ఆఫీసులు, ఆస్పత్రులు, షాపులు, రెస్టారెంట్లలో కూడా శుభ్రం చేస్తున్నారు. ఏటీఎంల కీపాడ్ శుభ్రం చేసేందుకు కూడా వాలంటీర్లు నైట్ షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. పీల్చడం ద్వారా వచ్చే ఫ్లూ వైరస్ లాగే, కోవిడ్-19 ఉన్న వ్యక్తి దగ్గినపుడు అతడి ముక్కు, నోటి నుంచి వచ్చిన చిన్న తుంపర్ల ద్వారా ఈ వైరస్ వ్యాపించవచ్చు. చిన్నగా దగ్గినా మూడు వేలకు పైగా తుంపర్లు బయటికి వస్తాయి. ఇవి మిగతావారిపై, చుట్టూ ఉన్న బట్టలు, ఇతర ఉపరితలాలపై పడతాయి. ఎవరైనా టాయిలెట్ వెళ్లిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకుంటా దేన్నైనా ముట్టుకుంటే, వాటిని వైరస్‌తో కలుషితం చేసే ప్రమాదం ఉంది.

ఆహార పదార్థాల విషయానికొస్తే డెలివరీ బాయ్ నుంచి తీసుకునే ముందు మీ చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోండి.ఆ తర్వాత ఆ ప్యాకెట్‌పై కిచెన్ స్ప్రే చల్లండి. ఆ తర్వాత మాత్రమే ఆ ప్యాకెట్‌ను విప్పండి. ఆపై మరోసారి చేతులు శుభ్రం చేసుకొన్న తర్వాత తినవచ్చు. న్యూస్ పేపర్ విషయానికొస్తే మరీ అంత కంగారు పడాల్సిన పని లేదు. వాటిపై వైరస్ అతి తక్కువ సమయం మాత్రమే మనుగడ సాగించగల్గుతుంది. అయినప్పటికీ పేపర్ ముట్టుకునే ముందు, తరువాత చేతులు శుభ్రపరచుకోవడం మంచిది. వైరస్ మనుగడను దృష్టిలో పెట్టుకొని తరచూ ముట్టుకునే ప్లాస్టిక్ వస్తువులను, డోర్ హ్యాండిల్స్ వంటి స్టీల్ వస్తువులను తరచూ శానిటైజర్ వంటి రసాయనాలతో శుభ్రపరచడం తప్పనిసరి. పళ్లు, కూరగాయలను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని నీళ్లలో శుభ్రంగా కడగాలి. ఆపై పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత మీరు కూడా మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.

IPL 2021 : ధోనీపై వస్తున్న పుకార్లుకు బ్రేక్ వేసిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ రూమర్స్ ఏంటో తెలుసా..?

CM KCR Review on Corona : తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కోవిడ్ టెస్ట్‌లను భారీగా పెంచాలని నిర్ణయం

IPL 2021: ఐపీఎల్ జోష్‌‌లో ఏ జట్టు కెప్టెన్‌కు పారితోషకం ఎక్కవ..? ఎవరికి తక్కువ..? ఓ లుక్కేద్దాం..!