Carona Virus : మీకు కరోనా లక్షణాలు ఉన్నాయా..! అయితే ఇంటి వద్దే ఇలా చికిత్స తీసుకోండి..?

Carona Virus Treated at Home : దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి.

Carona Virus  : మీకు కరోనా లక్షణాలు ఉన్నాయా..! అయితే ఇంటి వద్దే ఇలా చికిత్స తీసుకోండి..?
Carona Virus
Follow us
uppula Raju

|

Updated on: Apr 09, 2021 | 5:52 AM

Carona Virus Treated at Home : దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. వారందరికి ట్రీట్ మెంట్ ఇవ్వడం అంత ఈజీగా కాదు. వైద్యులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి విస్తృతం అవుతున్న నేపథ్యంలో రోగులకు చికిత్స అందిస్తున్న విధానాలకు సంబంధించి కేంద్రం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వైర‌స్ సోకిన చాలా మంది హోమ్ ఐసోలేష‌న్ ఉండాల‌ని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే అస‌లు చాలా మందికి ఇంట్లో ఉండేట‌ప్పుడు ఏం చేయాలో స్పష్టమైన అవ‌గాహ‌న ఉండ‌టం లేదు. అయితే వారు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కగా వెలుతురు, గాలి వ‌చ్చే గ‌దిలో క‌రోనావైర‌స్ సోకిన‌వారిని ఉంచాలి. వారికి ఉప‌యోగించే మ‌రుగుదొడ్డిని వేరెవ‌రూ వాడ‌కూడ‌దు. రోగుల‌ను చూసుకోవ‌డానికి ఒక స‌హాయ‌కుడు వారికి ఎప్పుడూ అందుబాటు ఉండాలి. 55 ఏళ్లు పైబ‌డిన‌వారు, గ‌ర్భిణులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలుండేవారు, క్యాన్సర్‌, ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులు, రక్తపోటు, గుండె, కిడ్నీ సమస్యలుండేవారిని వేరే ఇంటికి పంపించాలి. ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంట‌ర్నెట్‌, బ్లూటూత్‌ల‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోవాలి. ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది రోజూ ఫోన్ చేస్తారు. వారికి పూర్తి స‌హ‌కారం అందించాలి. తర్వాత కరోనా లక్షణాలుండే వ్యక్తి ఎటువంటి సూచనలు పాటించాలో తెలుసుకుందాం.

నీళ్లు ఎక్కువ‌గా తాగాలి. గోరు వెచ్చటి నీరు మంచిది. గ‌ది నుంచి బ‌య‌ట‌కు వస్తే మాస్క్ ధ‌రించ‌డం తప్పనిసరి. ద‌గ్గే ట‌ప్పుడు లేదా తుమ్మే ట‌ప్పుడు హ్యాండ్ క‌ర్చీఫ్ లేదా టిష్యూ ఎప్పుడూ ఉప‌యోగించాలి. వాడిన క‌ర్చీఫ్‌, టిష్యూ, దుస్తులను గాలి చొర‌బ‌డ‌లేని క‌వ‌ర్లు, చెత్త బుట్టల్లో వేయాలి. వీలైతే ఇంటి బ‌య‌ట వీటిని కాల్చేయాలి. ఇత‌ర చెత్తతో వీటిని క‌ల‌ప‌కూడ‌దు. మ‌రుగుదొడ్డికి వెళ్లే ముందు, వెళ్లిన త‌ర్వాత చేతులను 40 నుంచి 60 సెకన్ల పాటు క‌డుక్కోవాలి. త‌డి చేతుల్ని తుడుచుకోవ‌డానికి క్లాత్ ఉప‌యోగించొద్దు. ఐసోలేష‌న్ గ‌దిని రోగులే శుభ్రం చేసుకోవాలి. ఇంటికి శుభ్రం చేసేందుకు బ్లీచింగ్ పౌడ‌ర్ లేదా డిస్ ఇన్ఫెక్టెంట్‌ల‌ను ఉప‌యోగించాలి. రోజుకు రెండు సార్లు గ‌దిని శుభ్రం చేయాలి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొగ తాగ‌కూడ‌దు. ఎందుకంటే వైర‌స్ శ్వాస‌కోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. వాడిన దుస్తులను 30 నిమిషాల‌పాటు వేడి నీళ్లలో పెట్టి త‌ర్వాత ఉత‌కాలి.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ