AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 : ధోనీపై వస్తున్న పుకార్లుకు బ్రేక్ వేసిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ రూమర్స్ ఏంటో తెలుసా..?

MS Dhoni’s future: కెప్టెన్ ధోనీపై వస్తున్న పుకార్లకు బ్రేక్ వేసింది చెన్నై సూపర్ కింగ్స్.  ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్‌ అన్న రూమర్స్ వస్తున్న నేపథ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం స్పందించింది. ధోనిలో..

IPL 2021 : ధోనీపై వస్తున్న పుకార్లుకు బ్రేక్ వేసిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ రూమర్స్ ఏంటో తెలుసా..?
Sanjay Kasula
|

Updated on: Apr 08, 2021 | 11:56 PM

Share

కెప్టెన్ ధోనీపై వస్తున్న పుకార్లకు బ్రేక్ వేసింది చెన్నై సూపర్ కింగ్స్.  ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్‌ అన్న రూమర్స్ వస్తున్న నేపథ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం స్పందించింది. ధోనిలో అత్యుత్తమ క్రికెట్‌ ఆడగలిగే సత్తా ఇంకా ఉందని తేల్చి చెప్పింది. అతను మరిన్ని ఐపీఎల్‌లు ఆడగలడని, ఐపీఎల్‌ 2021 కచ్చితంగా అతనికి ఆఖరి ఐపీఎల్‌ కాబోదని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వ‌నాథ‌న్ ప్రకటించాడు.

అయితే ఇది పూర్తిగా నా వ్య‌క్తిగ‌త అభిప్రాయమని ఆయన చెప్పడం ఇక్కడ మరింత చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతానికి తాము ధోని ప్రత్యామ్నాయం గురించి ఆలోచించట్లేదని… మున్ముందు కూడా ఆ ఆలోచన చేసే అవకాశం రాకపోవచ్చని ఆయన స్పష్టం చేశాడు. కాగా, ధోని ఇటీవలే అంతార్జతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన విశయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. జట్టులోని మ‌రో ఇద్ద‌రు ముఖ్య‌ ఆట‌గాళ్ల గురించి కూడా కాశీ విశ్వ‌నాథ‌న్ రియాక్ట్ అయ్యారు. రైనా, జడేజాల రూపంలో తమ జట్టులో ఇద్దరు భారీ హిట్టర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. వారు రానున్న సీజన్‌లో కుర్రాలతో పోటీపడి మరీ పరుగులు సాధిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జ‌డేజా ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ.. దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. అతను ఫిట్‌గా ఉన్నాడ‌ని ఎన్‌సీఏనే స్వయంగా చెప్పిందని పేర్కొన్నారు. ప్రస్తుతం జడేజా జట్టుతో చేరాడని.. తమ తొలి మ్యాచ్‌లోపు అత‌ను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: Alert Wi-Fi: పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా..? వాడుకుని బ్యాకింగ్ ట్రాన్సక్షన్స్ చేస్తున్నారా? అయితే బీ అలర్ట్..!

COVID-19 Confirmed: ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానంటూ ట్వీట్..