AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Methi Payasam: శరీరానికి చలువ చేసే మెంతుల పాయసం.. ఇలా చేశారంటే అదిరిపోతుంది!

పాయసాన్ని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. పాయసాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని పెంచేవి కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి మెంతుల పాయసం. బియ్యం, మెంతులు కలిపి చేసే ఈ పాయసం శరీరానికి చేసే మేలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. మెంతుల పాయసం తినడం వల్ల బాలింతల్లో పాలు బాగా పడతాయి. అలాగే చదువుకునే పిల్లలకు ఈ పాయసం బెస్ట్ అని చెప్పవచ్చు. వారిలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. జ్ఞాప‌క శక్తిని పెంచుతుంది. ఎప్పుడూ ఒకే..

Methi Payasam: శరీరానికి చలువ చేసే మెంతుల పాయసం.. ఇలా చేశారంటే అదిరిపోతుంది!
Fenugreek Seeds
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 11, 2023 | 9:31 PM

Share

పాయసాన్ని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. పాయసాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని పెంచేవి కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి మెంతుల పాయసం. బియ్యం, మెంతులు కలిపి చేసే ఈ పాయసం శరీరానికి చేసే మేలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. మెంతుల పాయసం తినడం వల్ల బాలింతల్లో పాలు బాగా పడతాయి. అలాగే చదువుకునే పిల్లలకు ఈ పాయసం బెస్ట్ అని చెప్పవచ్చు. వారిలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. జ్ఞాప‌క శక్తిని పెంచుతుంది. ఎప్పుడూ ఒకే పాయసం కాకుండా ఇలా వెరైటీగా కూడా చేసుకోవచ్చు. ఈ పాయసాన్ని దేవుడికి కూడా నివేదన చేసుకోవచ్చు. మరి ఇంత హెల్దీ రెసీపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతి పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు:

మెంతులు, బియ్యం, నెయ్యి, కొబ్బరి కాయ, బెల్లం తురుము, ఉఫ్పు, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్

ఇవి కూడా చదవండి

మెంతి పాయసం తయారీ విధానం:

ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని.. రాత్రంగా మెంతులను నాన బెట్టాలి. తర్వాత బియ్యాన్ని కడిగి ఒక గంట పాటు వాటిని కూడా నాన బెట్టాలి. ఆ తర్వాత కొబ్బరి కోరుకుని పక్కన పెట్టుకోవాలి. లేదా కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ చేసుకోవచ్చు. దీని నుండి కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇప్పుడు నాన బెట్టుకున్న బియ్యం, మెంతులను కుక్కర్ లో వేసి, కొన్ని కొబ్బరి పాలు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి అంతా కలిసేలా మరోసారి కలుపుకోవాలి.

ఈ లోపు మిగిలిన కొబ్బరి పాలల్లో కొద్దిగా ఉప్పు వేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ఖాళీ గిన్నె పెట్టుకుని అందులో గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టి ముందుగా ఉడికించిన మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని.. కుక్కర్ ను మళ్లీ స్టవ్ మీద పెట్టి అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆ తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో హెల్దీ అండ్ సింపుల్ మెంతి పాయసం రెడీ.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..