Noodles Pakoda: నూడుల్స్ పకోడాలను ఇలా తయారు చేస్తే.. కమ్మగా, రుచిగా ఉంటాయి!
ఇన్ స్టెంట్ గా అప్పటికప్పుడు తయారు చేసుకునే వాటిల్లో నూడుల్స్ పకోడాలు కూడా ఒకటి. డిఫరెంట్, టేస్టీగా, వెరైటీగా ఉంటాయి. చిన్న పిల్లలు, పెద్దలు కూడా వీటిని ఇష్ట పడి తింటారు. వీటి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా.. ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తే.. పిల్లలకు కూడా సరదా పడి తింటారు. ఈ నూడుల్స్ పకోడా తయారు చేయడం కూడా చాలా సులభం. ఇవి బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉంటాయి. ఏవైనా స్పెషల్ డేస్ లో తయారు చేసుకోవచ్చు. మరి ఈ నూడుల్స్ పకోడాలకు..

ఇన్ స్టెంట్ గా అప్పటికప్పుడు తయారు చేసుకునే వాటిల్లో నూడుల్స్ పకోడాలు కూడా ఒకటి. డిఫరెంట్, టేస్టీగా, వెరైటీగా ఉంటాయి. చిన్న పిల్లలు, పెద్దలు కూడా వీటిని ఇష్ట పడి తింటారు. వీటి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా.. ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తే.. పిల్లలకు కూడా సరదా పడి తింటారు. ఈ నూడుల్స్ పకోడా తయారు చేయడం కూడా చాలా సులభం. ఇవి బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉంటాయి. ఏవైనా స్పెషల్ డేస్ లో తయారు చేసుకోవచ్చు. మరి ఈ నూడుల్స్ పకోడాలకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
నూడుల్స్ పకోడాకి కావాల్సిన పదార్థాలు:
నూడుల్స్, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, కారం, ఉప్పు, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, కొత్తి మీర, శనగ పిండి, నూడుల్స్ మసాలా పొడి, బియ్యం పిండి, నూనె.
నూడుల్స్ పకోడా తయారీ విధానం:
ముందుగా ఒక లోతైనా గిన్నె తీసుకుని అందులో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇన్ స్టెంట్ నూడుల్స్ వేసి.. మరీ మెత్తగా కాకుండా.. కాస్త పలుకు ఉండేలా చూసుకుని దించు కోవాలి. ఆ తర్వాత వీటిని ఒక జల్లెడలోకి తీసుకుని వెంటనే కొద్దిగా నూనె వేసి మొత్తం రాయాలి. దీంతో అవి అంటుకు పోకుండా ఉంటాయి.
ఇప్పుడు వీటిని మరో పాత్రలోకి తీసుకుని.. అందులో ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, కారం, ఉప్పు, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, కొత్తి మీర, శనగ పిండి, నూడుల్స్ మసాలా పొడి, బియ్యం పిండి అన్నీ వేసి బాగా కలుపు కోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కడాయిలో నూనె వేసి బాగా వేడి చేసుకోవాలి.
ఆయిల్ వెడెక్కాక.. నూడుల్స్ మిశ్రమాన్ని తీసుకుంటూ పకోడీల మాదిరిగా వేసుకుంటే సరి పోతుంది. వీటిని మీడియం మంటపై ఎర్రగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని టమాటా సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా డిఫరెంట్ గా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.