- Telugu News Photo Gallery Mustard leaves benefits can it prevent from lung cancer how to make mustard leaves Telugu News
Mustard Leaves benefits: ఆవాల ఆకులతో ఎన్ని ఉపయోగాలో తెలుసా.. !
ఆకుకూరలు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. చాలా మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మాత్రమే పచ్చటి కూరగాయలను తింటారు. కానీ, అలా కాకుండా ఆకుకూరలను రోజూ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆకు కూరల్లో ఒకటిగా చెప్పబడే ఆవాల ఆకులు మన ఆర్యోగానికి ఎంతో మేలు చేస్తాయి. ఆవాల ఆకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 31, 2023 | 4:19 PM

ఆవాల ఆకులను వివిధ ఆకుకూరల మాదిరిగానే కూర చేసుకొని తినవచ్చు. ఆవాల ఆకు కూర వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు. ఇందులో విటమిన్ సి, మైక్రో న్యూటియన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు..ఆవాల ఆకును యాంటీ క్యాన్సర్ ఆకు అని పిలుస్తారు. దీని తీసుకోవడం వల్ల లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు, ఇతర క్యాన్సర్ కణాలను వ్యాప్తి చెందకుండా ఉంచుతుందని నిపుణులు అంటున్నారు.

ఆవాలను మైక్రో గ్రీన్స్ లాగా తయారు చేసుకుని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వచ్చే వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లు ఈ ఆవాల ఆకును తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఆవాల ఆకును తీసుకోవడం వల్ల అనేక అనార్యోగ సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

ఆవాలు, ఆవాల ఆకులు, ఆవ పిండిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో ఐరన్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఆవ కూర తినటం వల్ల జీవక్రియ రేటు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. ఆవ ఆకులలో డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చలికాలంలో ఆవాలు, ఆవకూర, ఆవపిండి తీసుకోవటం వల్ల మీ శరీరంలో మెరుగైన జీవక్రియ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో సహాయపడే ఖనిజాల మంచి మూలం. ఇది మీ జీర్ణశక్తిని మెరుగుపరచడానికి, ఆహారాలు జీర్ణం కావడానికి తోడ్పడుతుంది

ఆవాలలో ఉండే పొటాషియం శరీరం నుండి నీరు నిలుపుదలని తగ్గిస్తుంది. అలాగే ఇందులో విటమిన్ K కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె మరియు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆవాల ఆకులు, బంగాళా దుంపలు కలిపి పరోటాలు చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ ఆకులతో పులుసు కూడా చేసుకోవచ్చు .





























