- Telugu News Photo Gallery Why does blood pressure rise after marriage? check here is details in Telugu
BP After Marriage: పెళ్లి తర్వాతే రక్త పోటు ఎందుకు వస్తుంది? తెలుసుకోండిలా..
పెళ్లి తర్వాతే బీపీ వస్తుందని మీకు తెలుసా? అందేంటి అని షాక్ అవుతున్నారా.. నిజమే. పెళ్లి కాక ముందు ఎవరి జీవితం వారిదే. పెద్దగా బాధ్యతలు, బరువులు ఏమీ ఉండవు. కానీ ఒక్కసారి పెళ్లి అయ్యాక.. ఇద్దరి లైఫే మారిపోతుంది. అందులోనూ పిల్లలు ఉంటే.. వారు ఎప్పుడు లేస్తారో? ఎప్పుడు తింటారు తెలీదు. ఇలా రక రకాల టెన్షన్స్ అనేవి మొదలవుతాయి. దీంతో రక్త పోటు పెరుగుతుంది. పెళ్లి తర్వాతే బీపీ వస్తుందని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. పెళ్లి అయ్యాక జంట ఇద్దరిలో రక్త పోటు సమస్య పెరుగుతుంది. చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Dec 31, 2023 | 4:44 PM

పెళ్లి తర్వాతే బీపీ వస్తుందని మీకు తెలుసా? అందేంటి అని షాక్ అవుతున్నారా.. నిజమే. పెళ్లి కాక ముందు ఎవరి జీవితం వారిదే. పెద్దగా బాధ్యతలు, బరువులు ఏమీ ఉండవు. కానీ ఒక్కసారి పెళ్లి అయ్యాక.. ఇద్దరి లైఫే మారిపోతుంది. అందులోనూ పిల్లలు ఉంటే.. వారు ఎప్పుడు లేస్తారో? ఎప్పుడు తింటారు తెలీదు. ఇలా రక రకాల టెన్షన్స్ అనేవి మొదలవుతాయి. దీంతో రక్త పోటు పెరుగుతుంది. పెళ్లి తర్వాతే బీపీ వస్తుందని పలు అధ్యయనాల్లో కూడా తేలింది.

పెళ్లి అయ్యాక జంట ఇద్దరిలో రక్త పోటు సమస్య పెరుగుతుంది. చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రక్త పోటు సమస్య.. దంపతుల ఇద్దరిలో వస్తుంది. లేదా ఒకరిలో వచ్చిన మరి కొద్ది రోజులకు మరొకరిలో కనిపిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జీవించినప్పుడు.. వారి జీవన శైలి కూడా ఒకేలా ఉంటుంది.

ఆరోగ్య పరంగా ఇద్దరూ ఎదుర్కొనే సమస్యలు కూడా ఒకేలా ఉంటాయి. ఆహారం కూడా అలాగే ఉంటుంది. అందువల్ల వారి జీవన శైలి కారణంగా దంపతుల ఇద్దరిలోనూ బీపీ సమస్యను చూస్తారు. ఇలా మధ్య వయస్సు తర్వాత ఇద్దిరలో కూడా రక్త పోటు సమస్య కనిపిస్తుంది.

బీపీ చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బీపీ కారణంగా హార్ట్ స్ట్రోక్, పలు గుండె సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీలైనంత వరకూ బీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలి. అలాగే మీ లైఫ్ స్టైల్ లో చేర్పులు మార్పులు చేసుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీని వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. అదే విధంగా మంచి ఆహారం తీసుకోవాలి. ఉప్పు తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోండి. అలాగే ప్రతి రోజూ 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. మంచి నిద్రతోనే చాలా సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడిని కూడా వీలైనంత వరకూ ఎక్కువగా తీసుకోకూడదు.





























