- Telugu News Photo Gallery Taking these foods will make your brain sharp, check here is details in Telugu
Food for Memory: చిన్న విషయాలను కూడా మర్చిపోతున్నారా.. బ్రెయిన్‌ని ఇలా షార్ప్ చేసుకోండి!
డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్లు ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని తగ్గిస్తాయి. అదే విధంగా మెదడు పని తీరులో కూడా ఎలాంటి సమస్య ఉండదు. బ్రోకలీలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కే కూడా సమృద్ధిగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గుమ్మడి, పుచ్చకాయ గింజల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా చేస్తాయి. వీటిల్లో జింక్, ఐరన్, కాపర్ వంటి ఉంటాయి. ఇవి జ్ఞాపక శక్తిని పెంచేందుకు..
Chinni Enni | Edited By: Janardhan Veluru
Updated on: Jan 01, 2024 | 2:57 PM

ఇప్పుడున్న బిజీ లైఫ్ లో రెస్ట్ తీసుకునేందుకు కూడా సమయం ఉండటం లేదు. ఆఫీసు పనులు, ఇంట్లో పనులు, ఫైనాన్షియల్ మేటర్స్ ఇలా బ్రెయిన్ కి రెస్ట్ అనేదే ఉండటం లేదు. బ్రెయిన్ పై ఎక్కువగా ఒత్తిడి పెట్టడం వల్ల మెమరీపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతూ ఉంటారు. ఇలా ఉండే కొద్దీ జ్ఞాపక శక్తి కూడా నశిస్తుంది. అయితే మీ డైట్ లో పలు రకాల ఆహారాలను చేర్చుకోవడం వల్ల మెదడుకు పదను పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్లు ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని తగ్గిస్తాయి. అదే విధంగా మెదడు పని తీరులో కూడా ఎలాంటి సమస్య ఉండదు. బ్రోకలీలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కే కూడా సమృద్ధిగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

గుమ్మడి, పుచ్చకాయ గింజల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా చేస్తాయి. వీటిల్లో జింక్, ఐరన్, కాపర్ వంటి ఉంటాయి. ఇవి జ్ఞాపక శక్తిని పెంచేందుకు సహాయ పడతాయి.

నట్స్ అనేవి బ్రెయిన్ కు సూపర్ ఫుడ్స్ గా చెప్పొచ్చు. వీటిని తినడం వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. మెరుగ్గా పని చేస్తాయి. నట్స్ లో ఉండే ఓమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయి.

మెదడు సక్రమంగా పని చేయాలంటే న్యూరాన్స్ అవసరం అవుతాయి. న్యూరాన్స్ తయారు చేయడానికి ఓమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం అవుతాయి. సాల్మన్ చేపల్లో ఓమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అధికంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది.





























