- Telugu News Photo Gallery High Cholesterol In Women: 5 Reasons Why LDL Levels Increase And How To Control It In Your 40s, Know here
High Cholesterol In Women: అందుకే 40 దాటాక మహిళలు బరువు పెరుగుతారు.. ఈ ఆహారాలు తింటే గుండె జబ్బులు ఖాయం
ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ సమస్యలు సర్వసాధారణం అవుతున్నాయి. రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా శరీరంలోని ఎన్నో సమస్యలు పెరుగుతున్నాయి. దీని వల్ల మధుమేహం, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. శరీరంలో మంచి, చెడు అనే రెండు రకాల కొలెస్ట్రాల్లు ఉంటాయి. అదనపు క్యాలరీలు ఉండే ఆహారాలు, వేపుడు పదార్థాలు ఎక్కువగా తింటే సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే పిల్లల్లో చిన్నతనం నుంచే కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయి..
Updated on: Jan 01, 2024 | 12:18 PM

ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ సమస్యలు సర్వసాధారణం అవుతున్నాయి. రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా శరీరంలోని ఎన్నో సమస్యలు పెరుగుతున్నాయి. దీని వల్ల మధుమేహం, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. శరీరంలో మంచి, చెడు అనే రెండు రకాల కొలెస్ట్రాల్లు ఉంటాయి. అదనపు క్యాలరీలు ఉండే ఆహారాలు, వేపుడు పదార్థాలు ఎక్కువగా తింటే సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు.

అందుకే పిల్లల్లో చిన్నతనం నుంచే కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయి. అధిక కొలెస్ట్రాల్ గుండెపై ఒత్తిడి తెస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ఒకే చోట కూర్చొని నిరంతరం పని చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సమస్యకు మరో కారణం. సాధరణంగా 40 ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో కొలెస్ట్రాల్ సమస్యలు పెరుగుతుంటాయి. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ కారణమని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ హార్మోన్ ప్రభావం వల్ల శరీరంలో అనేక సమస్యలు తీవ్రమవుతుంటాయి. దాంతో కొలెస్ట్రాల్ కూడా పెరుగుతోంది. మెనోపాజ్ తర్వాత హార్మోన్ల మార్పుల వల్ల మహిళల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

స్త్రీల శరీరంలో చాలా సమస్యలు మెనోపాజ్ తర్వాత వస్తాయి. రక్తంలో LDL కొలెస్ట్రాల్ స్థాయి చాలా పెరుగుతుంది. ఈ కొలెస్ట్రాల్ రెగ్యులర్ చెక్-అప్‌లు ద్వారా కూడా గుర్తించలేరు. గుండెపోటు వంటి సమస్యలు ఇక్కడి నుంచే వస్తాయి. శాచ్యురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్, ఫ్యాటీ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్, బేక్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. లావుగా ఉన్నవారికి, అధిక బరువు ఉన్నవారికి ఈ సమస్యలు మరింత ఎక్కువ.

కొలెస్ట్రాల్ సమస్యలు వంశపారంపర్యంగా కూడా వస్తాయి. ఏ కారణం చేతనైనా కొలెస్ట్రాల్ పెరిగితే అక్కడి నుంచి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే డైట్ పాటించడం చాలా ముఖ్యం.

పెరిమెనోపాజ్, మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు మహిళల కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ఈస్ట్రోజెన్ HDL కొలెస్ట్రాల్ సరైన స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. మెనోపాజ్ సమయంలో కొలెస్ట్రాల్ ఈ హార్మోన్ పనితీరును నిలిపివేస్తుంది.





























