AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inguva : హైబీపీ,జీర్ణ సంబంధిత సమస్యలకు ఇంగువ దివ్యౌషధం.. ఇలా వాడితే చిటికెలో బీపీ తగ్గుతుంది!

ఒక చెంచా నీళ్లలో ఇంగువను కరిగించి మొత్తటి క్రీంలా తయారు చేసుకుని పొట్ట చుట్టూ రాసుకుంటే కడుపునొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు, గ్యాస్ సమస్య, అసిడిటీ, మలబద్ధకం మొదలైన సమస్యలు నివారించేందుకు క్రమం తప్పకుండా ఇంగువను వంటల్లో వాడుతూ ఉంటే.. వీటన్నింటి నుంచి త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.

Inguva : హైబీపీ,జీర్ణ సంబంధిత సమస్యలకు ఇంగువ దివ్యౌషధం.. ఇలా వాడితే చిటికెలో బీపీ తగ్గుతుంది!
Inguva
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 10, 2023 | 11:21 AM

సాధారణంగా చాలా మంది ఇంగువ వాడుతుంటారు. కానీ, ఇంగువ ఎప్పటి నుంచో చాలా రకాల హోం రెమెడీస్ లో వాడుతున్నారు. ముఖ్యంగా కడుపు సమస్యలకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. మీరు అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా ఇంగువ ఉపయోగపడుతుందని మీకు తెలుసా..? ఈరోజుల్లో అధిక రక్తపోటు అనేది సర్వసాధారణమైన సమస్యగా మారింది. ప్రస్తుతం ప్రతి ఇద్దరిలో ఒకరు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఇంగువ మీకు సహాయం చేస్తుంది. అవును, అధిక రక్తపోటు రోగులకు ఇంగువ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

రక్తపోటు ఉన్న రోగులు ఇంగువను ఆహారంలో చేర్చుకోవటం ఉత్తమమైన, సులభమైన మార్గం. ఇందుకోసం మీరు మీ ఇంట్లో వండుకునే పప్పులు, కూరగాయలలో ఇంగువాను ఉపయోగించండి. ఇది మీ ఆహారం రుచిని కూడా పెంచుతుంది. మీ BP ని అదుపులో ఉంచుతుంది. ఇంగువలో యాంటీ-వైరల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి మనలను కాపాడుతుంది. దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి పలు రకాల శ్వాసకోశ సమస్యల చికిత్సలో కూడా ఇంగువను ఔషధంగా ఉపయోగిస్తారు.

అధిక రక్తపోటు ఉన్న రోగులు తేనె, పొడి అల్లంతో ఇంగువను కలిపి తీసుకోవచ్చు. ఇది మీకు ఆస్తమా, శ్వాస సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. మీ BP కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సైంధవ వలణంతో పాటు ఇంగువ వాడకం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంగువను పొడి రూపంలో కూడా ఉపయోగించవచ్చు. అందుకు తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్లలో అర చెంచా సైంధవ లవణం, చిటికెడు ఇంగువ కలిపి తీసుకుంటే కడుపునొప్పి, వాతం, గ్యాస్, అధిక రక్తపోటు నశించడమే కాకుండా.. కడుపునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

భోజనం తర్వాత అర టీస్పూన్ ఇంగువతో చిటికెడు రాతి ఉప్పు కలిపి, గోరువెచ్చని నీటితో కలిపి తాగినట్టయితే.. కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఒక చెంచా నీళ్లలో ఇంగువను కరిగించి మొత్తటి క్రీంలా తయారు చేసుకుని పొట్ట చుట్టూ రాసుకుంటే కడుపునొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు, గ్యాస్ సమస్య, అసిడిటీ, మలబద్ధకం మొదలైన సమస్యలు నివారించేందుకు క్రమం తప్పకుండా ఇంగువను వంటల్లో వాడుతూ ఉంటే.. వీటన్నింటి నుంచి త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..