Curd Benefits: పెరుగుతో బెల్లం తీసుకుంటున్నారా.. అయితే, తప్పక ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
పెరుగులో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగులో బెల్లం కలిపి తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగు, బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇందులో క్యాల్షియం కూడా ఉంటుంది. మరోవైపు, బెల్లం అనేక సీజనల్ వ్యాధుల నుంచి రక్షించడానికి పనిచేస్తుంది. పెరుగులో బెల్లం కలిపి తింటే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో రక్తహీనత రాదు. ఇది శరీరం బలహీనతను తొలగిస్తుంది.
పెరుగులో బెల్లం కలిపి తింటే పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో గ్యాస్, ఎసిడిటీ సమస్య దరిచేరదు. ఇది ఉబ్బరం నుంచి ఉపశమనాన్ని అందించడానికి కూడా పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పెరుగులో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పీరియడ్స్ క్రాంప్ సమయంలో మహిళలు పెరుగులో బెల్లం కలిపి తినవచ్చు. ఇది కడుపు తిమ్మిరిని తొలగిస్తుంది.
రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడతారు. అటువంటి పరిస్థితిలో, పెరుగు, బెల్లం తీసుకోవడం ఈ వ్యాధుల నుంచి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..