Cashew Benefits: జీడిపప్పు ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.!
జీడిపప్పులో ఎన్నో పోషకాలతో పాటు విటమిన్ సి, జింక్, మెగ్నీషియం, సెలీనియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. శరీరంతో పాటు జుట్టు..
జీడిపప్పులో ఎన్నో పోషకాలతో పాటు విటమిన్ సి, జింక్, మెగ్నీషియం, సెలీనియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. శరీరంతో పాటు జుట్టు, చర్మానికి కూడా జీడిపప్పు చాలా ఉపయోగకరం. రక్తహీనత సమస్యను దూరం చేయడమే కాకుండా చర్మ కాంతిని పెంపొందించడంలో మేలు చేస్తుంది. జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు జీడిపప్పు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి.!
మీ చర్మం ఆరోగ్యకరంగా, ముడతలు లేకుండా ఉండాలంటే.. క్రమం తప్పకుండా రోజూ జీడిపప్పును తినాలి. మెగ్నీషియం, సెలీనియం, ఐరన్, భాస్వరం వంటి పోషకాలతో పాటు ప్రోటీన్లు, విటమిన్లు జీడిపప్పుల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం టోన్‌ను పెంపొందించడమే కాకుండా ముడతలు రాకుండా ఉండేలా చేస్తాయి. పొడవాటి, మెరిసే జుట్టు ఉండాలంటే జీడిపప్పు మీ డైట్‌లో భాగం కావడం తప్పనిసరి. జీడిపప్పులో కాపర్ ఉంటుంది, ఇది జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.
జీడిపప్పులో పొటాషియం, ఇతర అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా.. పెరుగుదలకు దోహదపడతాయి. మరోవైపు జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ చర్మంలో కొత్త కణాల పెరుగుదలకు దోహదపడతాయి. మీ చర్మాన్ని వేగంగా పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. రోజూ పరగడుపున జీడిపప్పు తినడం ముఖ్యం. అలాగే జీడిపప్పులో ఉండే విటమిన్ సి మచ్చలు తొలగించడంలో సహాయపడుతుంది. కాగా, జీడిపప్పులో ఉండే జియాక్సంతిన్(Zeaxanthin) అనే యాంటీ ఆక్సిడెంట్ హానికరమైన UV కిరణాల నుండి మీ కళ్ళను రక్షిస్తుంది.
Also Read:
సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!
బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!