Eggs Benefits: ఈ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు గుడ్డు తినాలి..! లేదంటే చాలా నష్టం..

Eggs Benefits: శరీరానికి గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో రకాల పోషకాహార విలువులుంటాయి. ఇవి శాఖహారులు కూడా తినవచ్చు. ప్రతిరోజూ గుడ్లు

Eggs Benefits: ఈ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు గుడ్డు తినాలి..! లేదంటే చాలా నష్టం..
Egg Eat Fresh
Follow us
uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Aug 25, 2021 | 8:01 PM

Eggs Benefits: శరీరానికి గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో రకాల పోషకాహార విలువులుంటాయి. ఇవి శాఖహారులు కూడా తినవచ్చు. ప్రతిరోజూ గుడ్లు తింటే శరీరంలో ప్రొటిన్స్ పెరుగుతాయి. ఇది శాస్త్రీయంగా కూడా నిరుపితమైంది. ఇందులో కాల్షియం, ఐరన్ 90 శాతం ఉంటుంది. అలాగే గుడ్డులో ఉండే పచ్చసోన, తెల్లటి పోరలో అత్యధికంగా ప్రోటీన్ శాతం ఉంటుంది. అందుకే గుడ్లను పోషకాహర నిధిగా పిలుస్తారు. గుడ్ల మీ రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో.. రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. దీంతోపాటు బరువును తగ్గించడంలో చాలా ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

1. కోడిగుడ్ల ద్వారా శరీరానికి ర‌క‌ర‌కాల‌ పోషకాలు లభిస్తాయి. గుడ్లలో శరీరానికి కావాల్సిన శాచురేటెడ్ ఫ్యాట్స్‌, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అదేవిధంగా పొటాషియం, విటమిన్-A, కాల్షియం, ఐరన్, విటమిన్-D, విటమిన్ B6, విటమిన్ B12, మెగ్నీషియం గుడ్డులో పుష్కలంగా ల‌భిస్తాయి. 2. కోడిగుడ్డు మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గుడ్డు సొనలో ఉండే కోలిన్ అనే పోషక పదార్థం మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 3. కోడిగుడ్డులోని ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఈ ఐరన్ గర్భిణులు, బాలింతలకు చాలా ఉపయోగపడుతుంది. గ‌ర్భిణులు, బాలింత‌లు ప్రతిరోజు ఉడుక‌బెట్టిన కోడిగుడ్డు తీసుకోవాలి. 4. అదేవిధంగా మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కూడా గుడ్డు ర‌క్షణ క‌ల్పిస్తుంది. 5. జట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకూ గుడ్డు ఉపయోగపడుతుంది. గుడ్డులో ఉండే విటమిన్-A కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. 6. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉండ‌టంవ‌ల్ల అవి ఎముకలు గట్టిపడటానికి తోడ్పడుతాయి. 7. నరాల బలహీనత ఉన్నవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా గుడ్డును తీసుకోవడంవ‌ల్ల ప్రయోజ‌నం ఉంటుంది.

పోషకాల నిధి.. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను ధృఢంగా తయారు చేస్తుంది. అందుకే గుడ్లను ఆరోగ్యకరమైన ఆహారంలో ఒకటిగా పరిగణిస్తారు. గుడ్లలో కేలరీలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, భాస్వరం, సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ బి 5, విటమిన్ బి 12, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 6 వంటి పోషకాలు ఉంటాయి. గుడ్లలో ట్రిప్టోఫాన్, టైరోసిన్ ఉంటాయి. అదనంగా గుడ్లలో అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి కావున ఇవి గుండె జబ్బుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Viral Photos: అందమైన సరస్సుల సొగసు వర్ణించతరమా..! మీరు ఓ లుక్కేయండి..

PM Narendra Modi: కళ్యాణ్‌ సింగ్‌ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్రమోడీ.. మాటల్లో చెప్పలేని బాధ ఉందంటూ ట్వీట్‌..

Kalyan Singh: వివాదాలతో సహవాసం అతడి జీవితం.. వాజ్‌పెయ్‌తో వైరం.. పార్టీ నుంచి బహిష్కరణలు..

మీరు 50 వేల రూపాయలకంటే ఎక్కువ మొత్తానికి చెక్ ఇస్తున్నారా? అయితే..ఈ నిబంధనలు పాటించాల్సిందే!