Curry leaves for Face: కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!

కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికీ తెలుసు. కరివేపాకు గురించి స్పెషల్‌గా పరిచయాలు అవసరం లేదు. కరివేపాకుతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను సైతం తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా విరివిగా కరివేపాకును ఉపయోగిస్తారు. కరివేపాకులో పలు రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అదే విధంగా జుట్టు రాలడం తగ్గి.. బాగా పెరగాలంటే జుట్టుతో హెయిర్ ప్యాక్స్ కూడా ట్రై చేయవచ్చు. అదే విధంగా..

Curry leaves for Face: కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
Curry Leaves For Face
Follow us

|

Updated on: Apr 19, 2024 | 3:42 PM

కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికీ తెలుసు. కరివేపాకు గురించి స్పెషల్‌గా పరిచయాలు అవసరం లేదు. కరివేపాకుతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను సైతం తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా విరివిగా కరివేపాకును ఉపయోగిస్తారు. కరివేపాకులో పలు రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అదే విధంగా జుట్టు రాలడం తగ్గి.. బాగా పెరగాలంటే జుట్టుతో హెయిర్ ప్యాక్స్ కూడా ట్రై చేయవచ్చు. అదే విధంగా కరివేపాకుతో కూడా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మెరుస్తున్న చర్మం కావాలని అందరూ అనుకుంటారు. అలాంటి వారు కరివేపాకుతో ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయవచ్చు. కరివేపాకు చర్మాన్ని దెబ్బతీయకుండా.. మచ్చలేని, కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. మరి ఆ చిట్కాలు ఏటో ఇప్పుడు చూసేయండి.

మచ్చలు లేని చర్మం కోసం:

ముందుగా కొద్దిగా కరివేపాకులు తీసుకుని.. నీటిలో వేసి ఉడకబెట్టాలి. ఇవి చల్లగా అయ్యాక.. మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌కు తేనె కలిపి.. ముఖం, మెడ, చేతులుకు రాసుకుని.. ఓ 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు. ఇలా చేస్తే ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. మీ ముఖం కూడా గ్లోయింగ్‌గా మారుతూ ఉంటుంది. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు.

స్కిన్ ఫ్రెష్‌గా ఉంటుంది:

కరివేపాకు నీటితో కూడా మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఇందు కోసం కొన్ని కరివేపాకులను.. నీటిలో ఉడక బెట్టాలి. ఇవి చల్లారాక.. ఈ నీటితో తరచూ ముఖాన్ని కడిగాలి. కావాలి అనుకుంటే దీన్ని టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీని వల్ల రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలా ప్రతి రోజూ మీరు కరివేపాకు నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

గ్లోయింగ్ స్కిన్ కోసం:

కరివేపాకును ఉడకబెట్టి పేస్ట్‌ చేసి అందులో నిమ్మరసం చుక్కలు వేసి ఫేస్ ప్యాక్‌లా ట్రై చేయవచ్చు. ఇది బాగా ఆరిపోయిన తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేస్తే.. కాంతి వంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మీ ముఖం అందంగా మారుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..