బజ్జీ, పకోడీలను మించిన స్నాక్ ఎగ్ బొండా.. క్రిస్పీ ఎగ్ బోండాని ఇంట్లో ఇలా చేయండి.. లోట్టలేసుకుని మరీ తింటారు..
కోడి గుడ్డుతో రకరకాల వంటలను తయారు చేస్తారు. కూరలు, ఆమ్లెట్ , ఎగ్ బిర్యానీ, వంటి వాటిని చేసుకుంటారు. అంతేకాదు అప్పటికప్పుడు తినాలంటే గుడ్లను ఉడికించి కూడా తింటారు. అయితే స్ట్రీట్ ఫుడ్ లో ఎక్కువగా కనిపించే స్నాక్ ఎగ్ బొండా. ముఖ్యంగా వర్షాకాలంలో తాజాగా, వేడిగా అమ్ముతారు. ఈ స్నాక్ ఐటెం ఎగ్ బొండాని టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రోజు రెసిపీ తెలుసుకుందాం..

పోషకాలతో లభించే చిరుతిండి ఎగ్ బొండా.. డిఫరెంట్ స్నాక్స్ ని ఇష్టపదేవారికి బెస్ట్ ఆప్షన్ ఇది. ఆంద్ర, తెలంగాణ అనే తేడా లేకుండా స్ట్రీట్ ఫుడ్ గా లభించే ఈ ఎగ్ బోండాను ఎగ్ బజ్జీ అని కూడా అంటారు. దీనిని ఇతర బజ్జీల మాదిరిగానే శనగ పిండి, ఉప్పు, వాము వంటి వాటితో తయారు చేస్తారు. ఆపై ఇష్టమైనవారు చాట్ మసాలా, కొత్తిమీరని వేసుకుని కొబ్బరి చట్నీ లేదా టమోటా కెచప్‌తో తింటారు. రుచికరమైన ఎగ్ బోండాలు పోషకాహారం కూడా. సాధారణ బజ్జీలు నుంచి వైవిధ్యాన్ని కోరుకునే వారికి ఈ ఎగ్ బొండా సరైనది. సాయంత్రం సమయంలో ఫుల్ డిమాండ్ ఉండే ఈ ఎగ్ బొండాని ఇంట్లోనే తయారు చేసుకోండి. రేసిపీ మీ కోసం
ఎగ్ బొండా కోసం కావాల్సిన పదార్థాలు
- గుడ్లు- 6 (ఉడికించినవి)
- శనగ పిండి – 3/4 కప్పు
- బియ్యపు పిండి – రెండు స్పూన్లు
- ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరిగిన ముక్కలు )
- కారం – అర స్పూన్
- పసుపు- చిటికెడు
- వంట సోడా _చిటికెడు (ఆప్షనల్)
- ఉప్పు- రుచికి సరిపడా
- జీలకర్ర- పావు స్పూన్
- పచ్చిమిర్చి – 1 టీస్పూన్ సన్నగా తరిగిన ముక్కలు
- కొత్తిమీర- 1 స్పూన్ తరిగిన
- చాట్ మసాలా- టీస్పూన్
- గరం మసాలా- పావు టీస్పూన్
- జీలకర్ర పొడి- పావు స్పూన్
- నూనె – వేయించడానికి సరిపడా
- నీరు- సరిపడా
తయారీ విధానం: ముందుగా గుడ్లను ఉడికించి .. పై పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బజ్జీ పై పూత కోసం ఒక గిన్నె తీసుకుని శనగ పిండి, బియ్యం పిండి, జీలకర్ర, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మాసాలా, పచ్చి మిర్చి ముక్కలు, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి.. కొంచెం కొంచెం నీరు పోసుకుని ఈ మిశ్రమం గట్టిగా ఉండేలా కలుపుకొండి.. ఈ పిండిలో గుడ్డు ముంచితే గుడ్డికి ఈ శనగ పిండి మిశ్రమం పట్టుకునేలా మందంగా కలుపుకుని ఇష్టమైన వారు కొంచెం వంట సోడా వేసుకుని పక్కకు పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి.. నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత శనగ పిండి మిశ్రమంలో గుడ్డు వేసి ఈ మిశ్రమం గుడ్డుకు బాగా పట్టుకునేలా చేసుకుని .. నూనె వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేటంత వరకూ వేయిచండి. ఇలా అన్ని గుడ్లు వేసుకుని వేయించి ఒక ప్లేట్ లో తీసుకుని.. వాటిని కట్ చేసి అందులో చాట్ మసాలా , కొత్తిమీర ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేడి వేడిగా ఇంట్లోని వారికీ అందించండి. పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా ఈ ఎగ్ బొండాని తింటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








