Viral Video: లగ్జరీ కారులో వచ్చిమరీ మ్యాన్‌హోల్ మూతని దొంగలించిన దొంగలు.. పాకిస్తాన్‌లో మాత్రమే సాధ్యం అంటున్న నెటిజన్లు
దొంగలు లగ్జరీ కారులో మ్యాన్‌హోల్ కవర్‌ను దొంగిలించడానికి వచ్చారు. కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ సిద్ధిఖీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే.. కామెంట్స్ వరదలా వెల్లువెత్తాయి. ఈ పోస్ట్‌పై పాకిస్తానీయులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. షాబాజ్ షరీఫ్ పాలనలో దేశం పరిస్థితి ఎంతగా మారిందంటే మేము మ్యాన్‌హోల్ కవర్‌ను దొంగిలించాల్సి వచ్చిందని వాపోతున్నారు.

పాకిస్తాన్ అంటే కష్టపడి పనిచేసే ప్రజలు తరచుగా ఇబ్బందులు ఎదుర్కొనే దేశం. అంతేకాదు అక్కడ దొంగలు మాత్రం ఓ రేంజ్ లో అభివృద్ధి చెందుతారు. అక్కడ దొంగల ‘పురోగతి’ చూసిన ఎవరైనా సరే వాహ్ భాయ్ !’ అని కూడా అంటారు. ఇటీవల కరాచీలో చోటు చేసుకున్న ఒక వీడియో సోషల్ మీడియా ప్రజలను ఆకర్షించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ నవ్వును నియంత్రించుకోలేకపోతున్నారు. ఈ 49 సెకన్ల వీడియో చూసిన వారికి పాకిస్తాన్‌లో దొంగతనం స్థాయి ఏ రేంజ్ కు చేరుకుందో తెలుస్తుంది.
ఇది మ్యాన్‌హోల్ కవర్ దొంగతనం కేసు. అయితే దొంగలు ఉపయోగించిన పద్ధతి కొంచెం ‘క్లాసీ’. వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డు పక్కన మెరిసే కారు ఆగినట్లు కనిపిస్తుంది. అప్పుడు ఇద్దరు పెద్దమనుషుల తరహా దొంగలు కారు నుంచి బయటకు దిగారు. అప్పుడు ఇద్దరు పెద్దమనుషులు మురుగు కాలువపై ఉన్న మ్యాన్ హోల్ మూతని తీసుకుని హాయిగా కారు డిక్కీలో పెట్టుకున్నారు. తర్వాత షాపింగ్ పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వీడియోను షేర్ చేసిన కరాచీ మేయర్
కరాచీ 27వ మేయర్ ముర్తాజా వహాబ్ సిద్ధిఖీ ఈ వీడియోను x @murtazawahab1లో షేర్ చేసిన వెంటనే.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తానీయులు ఈ పోస్ట్‌పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తంమీద ఈ వీడియో పాకిస్తాన్ ఆర్థిక , సామాజిక స్థితి గురించి ఆసక్తికరమైన.. చేదు నిజాన్ని వెలుగులోకి తెచ్చింది.
Please take out 49 seconds of ur time and see this video. This is what we are faced with on a daily basis pic.twitter.com/O31kpki744
— Murtaza Wahab Siddiqui (@murtazawahab1) June 3, 2025
పాకిస్తానీయులు ‘గాయం మీద ఉప్పు’ చల్లుతున్న కామెంట్స్
లగ్జరీ కార్లలో దొంగలు వచ్చే దేశం పరిస్థితి ఎలా ఉందో ఒకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లో దొంగల పాలన నడుస్తోందని మరొక యూజర్ వ్యంగ్యంగా అన్నారు. షాబాజ్ షరీఫ్ పాలనలో దేశం పరిస్థితి మ్యాన్‌హోల్ కవర్‌ను దొంగిలించాల్సినంతగా మారిందని కామెంట్ చేశారు. దొంగలు చాలా ‘మంచి’ కుటుంబానికి చెందినవారని మరొకరు వ్యాఖ్యానించారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




