AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాన్సర్ తో పోరాడుతున్న హీనా ఖాన్ కొత్త జీవితంలోకి అడుగు.. ప్రియుడు రాకీ జైస్వాల్‌ను రహస్యంగా వివాహం చేసుకున్న అక్షర

బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేని పేరు హీనా ఖాన్. యే రిష్తా క్యా కెహలాతా హై సీరియలో అక్షర పాత్రలో నటించిన హీనా ఖాన్ తన నటనతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇటీవల తనకు క్యాన్సర్ సోకిందని తనకోసం ప్రార్ధించమని చెప్పిన హీనా ఖాన్ ఇప్పుడు తన ప్రియుడు రాకీని రహస్యంగా వివాహం చేసుకుంది. తన చిరకాల ప్రియుడు రాకీ జైస్వాల్‌ను వివాహం చేసుకుంది. హీనా, రాకీలు తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

క్యాన్సర్ తో పోరాడుతున్న హీనా ఖాన్ కొత్త జీవితంలోకి అడుగు.. ప్రియుడు రాకీ జైస్వాల్‌ను రహస్యంగా వివాహం చేసుకున్న అక్షర
Hina Khan Marries Rocky Jaiswal
Surya Kala
|

Updated on: Jun 04, 2025 | 7:55 PM

Share

హిందీలో సూపర్ హిట్ సీరియల్ యే రిష్తా క్యా కెహలాతా హై సీరియిల్ తెలుగులో పెళ్లంటే నూరెళ్ల పంటగా డబ్ అయింది. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన అక్షర అంటే నటి హీనా ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. హీనా ఖాన్ ఇప్పుడు క్యాన్సర్‌తో పోరాడుతోంది. తాజాగా హీనా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. హీనా ఖాన్ తన ప్రియుడు రాకీ జైస్వాల్‌ను వివాహం చేసుకుంది. హీనా , రాకీలు రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆమె తన పెళ్ళికి సంబంధించిన చిత్రాలను అభిమానుల కోసం పంచుకుంది.

నటి హీనా ఖాన్ వివాహం చేసుకుంది. హీనా క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం కోసం అభిమానులను ప్రార్ధించమని అభిమానులను కోరిన సంగతి తెలిసిందే. తాజాగా హీనా తన ప్రియుడు రాకీతో ఏడు అడుగులు వేసింది. పెళ్ళికి సంబంధించిన అందమైన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీనా, రాకీలకు ఫ్యాన్స్ తమ ప్రేమని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హీనా ఖాన్ తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. రెండు వేర్వేరు ప్రపంచాలను కలపడం ద్వారా మనం ఒకే ప్రపంచాన్ని సృష్టించుకున్నాం అంటూ క్యాప్షన్ జత చేసింది. మేము మా మనోవేదనలన్నింటినీ చెరిపివేసి.. జీవితాంతం ఉండే సంబంధాన్ని ఏర్పరచుకున్నాము. మేము ఒకరికొకరు ప్రపంచం.. ఈ రోజు నుంచి మేము ఒకరికొకరుగా జీవిస్తామని రాఖీపై ఉన్న ప్రేమని వ్యక్తం చేసింది.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

పెళ్లి కూతురుగా దేవకన్యలా కనిపిస్తున్న హీనా ఖాన్

పెళ్లి ఫోటోలలో హీనా, రాకీలు చాలా అందంగా ఉన్నారు. వీరు చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. హీనా ఒపల్ ఆకుపచ్చ రంగు . వెండి రంగు కాంబినేషన్ తో ఉన్న చీరను ధరించింది. చాలా అందమైన ఆభరణాలను కూడా ధరించింది. హీనా చీరను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారు. హీనా వరుడు రాకీ కూడా ఓక్ తెల్లటి షేర్వానీ ధరించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..