టేస్ట్ కోసం అంటూ ఈ ఆహారపదార్థాలను కలిపి తింటున్నారా.. ఎన్ని రోగాలకు వెల్కం చెబుతున్నారో తెలుసా..
రుకరమైన ఆహారం అంటూ రకరకాల కాంబినేషన్ లో వస్తువులను కలిపి తింటాం.. ఇలా చేయడం వలన కొన్ని రకాల కాంబినేషన్స్ లోని ఫుడ్ శరీరానికి మేలుకు బదులుగా హానిని కలిగిస్తుంది. ముఖ్యంగా కొన్ని పదార్ధాలను కలిపి తినడం శాస్త్ర విరుద్దం అంటుంది ఆయుర్వేదం. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి తినకూడని కొన్ని ఆహార పదార్ధాలున్నాయి. అవి ఏమిటో తెల్సుకుని వీలైంత వరకూ తినొద్దు..
Updated on: Jun 04, 2025 | 7:26 PM

ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా ఆహారం తినే విషయంలో నియమాలున్నాయని చెప్పారు. కొన్ని రకాల ఆహారాల కలయిక తప్పుడు కలయిక అని.. ఇలా తినడం వలన శరీరంలో విషపదార్థాలు ఉత్పత్తి అవుతాయి, అప్పుడు జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అనేక వ్యాధులకు కూడా కారణమవుతుందని చెప్పారు. అటువంటి పరిస్థితిలో పొరపాటున కూడా ఏ వస్తువులను కలిపి తినకూడదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తద్వారా ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు.

పాలు- ఉప్పు అనేవి విరుద్ధమైన ఆహారంలో మొదటిగా వినిపించే పేర్లు. పాలు చల్ల దనం కలిపి.. తీపిగా ఉంటాయి, ఉప్పు వేడినిచ్చే స్వభావంతో ఘాటుగా ఉంటుంది. కనుక పాలను, ఉప్పుని కలిపి తినకూడదు. వీటి కలయిక రక్త శుద్ధిపై మాత్రమే కాదు చర్మంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది అలెర్జీలు, చర్మ వ్యాధులు (దిమ్మలు), జీర్ణ రుగ్మతలు వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది.

ఆయుర్వేదంలో పాలు .. చేపల వినియోగం కూడా ఖచ్చితంగా నిషేధించబడింది. రెండూ వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, చేపలు వేడి స్వభాన్ని కలిగి ఉన్నాయి. పాలు చల్లగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో విషం ఏర్పడుతుంది. ఇది చర్మ వ్యాధులు, అలెర్జీలు, తామర వంటి సమస్యలను కలుగజేస్తుంది.

చాలా మంది పండ్లను స్మూతీలు, షేక్‌లను తయారు చేసి తాగుతారు. అయితే ఆయుర్వేదం ప్రకారం పండ్లు , పాలు కలిపి తినకూడదు. ముఖ్యంగా పుల్లని పండ్లను పాలతో కలిపి అస్సలు తినకూడదు. పుల్లని పండ్లు పాలను విరిగేలా చేస్తాయి. జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తాయి. అంతేకాదు గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్యలను కలిగిస్తుంది ఈ కాంబినేషన్. అయితే సరైన మార్గంలో తీసుకుంటే మామిడి పండ్లు లేదా అరటిపండు వంటి తీపి పండ్లతో మిల్క్‌షేక్ తయారు చేసుకోవచ్చు.

తరచుగా కొంతమంది కడుపు నొప్పి నుంచి ఉపశమనం కోసం గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగుతారు. ఇది కూడా విరుద్ధమైన ఆహారం. అవును ఆయుర్వేదంలో గోరువెచ్చని నీరు, టీ లేదా పాలతో తేనె తీసుకోవడం నిషేధించబడింది. ఆయుర్వేదం ప్రకారం తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదు. వేడి చేసినప్పుడు తేనె విషంలా మారుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

తేనెను నెయ్యితో కూడా కలిపి తినకూడదు. నెయ్యి ... తేనెను సమాన పరిమాణంలో కలిపి తింటే అది శరీరానికి విషపూరితం కావచ్చు. ఇది శరీరంలో టాక్సిన్ ఏర్పడటానికి.. అసమతుల్యతకు దారితీస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ విరుద్ధమైన ఆహారాలను తీసుకోవద్దు.




