- Telugu News Photo Gallery Spiritual photos Mars and Mercury Transit July 7th: These are lucky zodiac signs details in Telugu
Lucky Zodiac Signs: కుజ, బుధుల రాశుల మార్పు.. అదృష్టం ఆ రాశులవారి తలుపు తట్టబోతోంది..!
Lucky Zodiac Signs: ఈ నెల (జూన్) 7వ తేదీన కుజ, బుధులు ఒకేసారి రాశులు మారుతున్నాయి. బుధుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తుండగా, కుజుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే తత్వం కలిగిన బుధుడు, దూకుడు తత్వం కలిగిన కుజుడు తమకు అత్యంత శక్తిమంతమైన రాశుల్లోకి మారడం జరుగుతోంది. ఈ గ్రహాల మార్పు వల్ల వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు విశేషంగా లబ్ధి పొందుతారు. ఇందులో బుధుడు ఈ నెల 22 వరకు మిథున రాశిలో సంచారం చేస్తుండగా, కుజుడు జూలై 28 వరకు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది.
Updated on: Jun 04, 2025 | 6:31 PM

వృషభం: ఆర్థిక విషయాల్లోనే కాక, ఎటువంటి వ్యవహారంలోనైనా ఆచితూచి వ్యవహరించే తత్వం కలిగిన వృషభ రాశికి ఈ రెండు గ్రహాలు(కుజ, బుధులు) అత్యంత అనుకూల ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి పకడ్బందీగా ప్రయత్నాలు సాగించడంతో పాటు, రావలసిన సొమ్మును వసూలు చేసు కోవడానికి పట్టుదలగా వ్యవహరించడం జరుగుతుంది. ఆస్తిపాస్తులను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆస్తి వివాదాన్ని రాజీమార్గంలో పరిష్కరించుకుని విలువైన ఆస్తిని చేజిక్కించుకుంటారు.

మిథునం: ప్రతి వ్యవహారంలోనూ పద్దతిగా వ్యవహరించే తత్వం కలిగిన ఈ రాశిలో రాశ్యధిపతి బుధుడు సంచారం చేయడం ఒక విశేషం కాగా, తృతీయ స్థానంలో కుజుడు సంచారం చేయడం మరో విశేషం. కొద్ది ప్రయత్నం, మరికొంత పట్టుదలతో ఈ రాశివారు పదోన్నతులు సంపాదించే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే సూచనలున్నాయి. రావలసిన సొమ్మును, బాకీలను రాబట్టుకుంటారు. చిన్నపాటి మదుపులు, పెట్టుబడుల ద్వారా అత్యధికంగా లాభాలు పొందుతారు.

సింహం: పట్టుదలకు మారుపేరైన ఈ రాశిలో కుజుడు, లాభ స్థానంలో బుధుడి సంచారం వల్ల ఆదాయ వృద్ధికి అనేక విధాలుగా ప్రయత్నించి సఫలీకృతులయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతుల విషయంలో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. కొద్ది మార్పులతో వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి చేస్తున్న ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో అత్యధికంగా లాభాలు గడిస్తారు.

తుల: ఏ రంగంలో ఉన్నా లాభాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎదురు చూసే ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి బుధుడు, లాభ స్థానంలో ధనాధిపతి కుజుడు సంచారం చేయడం వల్ల ఈ రాశివారు అనేక విధాలుగా లాభాలను కూడగట్టుకోవడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో వీరిని మించినవారు లేరని నిరూపించుకుంటారు. ఉద్యోగంలో పోటీదార్లపై పైచేయి సాధించి అధికారం చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను మించి లాభాలు గడిస్తారు.

ధనుస్సు: ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించుకోవడానికి ప్రయత్నించే ఈ రాశికి సప్తమ స్థానంలో బుధుడు, భాగ్య స్థానంలో కుజుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారు ఎంతో పట్టుదలగా వృత్తి, వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో వ్యాపారాల్లో లాభాలను బాగా పెంచుతారు. ఉద్యోగంలో తమ సమర్థతను, ప్రతిభను అనేక విధాలుగా నిరూపించుకుని పదోన్నతులు పొందుతారు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.

కుంభం: కొద్దిగా నిదానంగానే అయినా ఏ పనినైనా సాధించుకునే తత్వం కలిగిన ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడు, సప్తమ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో అనుకూలతలు కలుగుతాయి. ఆస్తిపాస్తుల సమస్యలను గట్టి ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ప్రేమలు, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. అనేక విధాలుగా ఆదాయాన్ని వృద్ధి చేస్తారు. సొంత ఇల్లు అమరుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.



