- Telugu News Photo Gallery Spiritual photos IRCTC Introduces Godavari Temple Tour Package for Weekend tour on every friday
Weekend Tour: వీకెండ్ టూర్ ప్లాన్ ఉందా.? ఐఆర్సిటీసి నయా టూర్ ప్యాకేజ్ మీ కోసమే..
ఐఆర్సిటీసి తరచూ ప్రయాణికుల కోసం కొత్త టూర్ ప్యాకేజీలను తీసుకొని వచ్చింది. అలాగే తాజాగా మరో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఇది వీకెండ్ సమయంలో టూర్ ప్లాన్ చేసుకున్నవారు బెస్ట్ అనే చెప్పాలి. మరి ఆ టూర్ వీకెండ్ ప్యాకేజ్ ఏంటి.? ఎక్కడికి.? టికెట్ ధర ఎంత.? దీని గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Updated on: Jun 05, 2025 | 11:00 AM

గోదావరి టెంపుల్ టూర్ పేరుతో ఓ కొత్త టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది ఐఆర్సిటీసి. ఈ ప్యాకేజీ కోడ్ SHR029 రాజమండ్రి, అన్నవరం, అంతర్వేది ప్రాంతాలను ఈ ప్యాకేజీలో కవర్ చేయవచ్చు. ఈ టూర్ మొత్తం రైలులో కొనసాగుతుంది. ఇందులో స్లీపర్ అండ్ థర్డ్ ఏసి అందుబాటులో ఉన్నాయి. ఈ టూర్ ప్రతి శుక్రవారం లింగంపల్లి నుంచి రాత్రి 08:30 గంటలకు ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ కూడా పిక్ అప్ పాయింట్ ఉంది.

01వ రోజు శుక్రవారం లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 08:30 గంటలకు, సికింద్రాబాద్ రాత్రి 09:15 గంటలకు రైలు నంబర్ 12738 (గౌతమి ఎక్స్‌ప్రెస్) ద్వారా మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

02వ రోజు శనివారం ఉదయం 04:38 గంటలకు రాజమండ్రి స్టేషన్ చిరుకొని అక్కడినుంచి హోటల్‌లో చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అవుతారు. తర్వాత రాజమండ్రి నుంచి 80 కి.మీ దూరంలో ఉన్న అన్నవరం వెళ్లి శ్రీ సత్యనారాయణ స్వామివారి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ ప్రసాదం తీసుకోవడం మర్చిపోవద్దు. ఇది చాల రుచికరంగా ఉంటుంది. సాయంత్రం మళ్లీ రాజమండ్రి తిరిగి వెళ్లి గోదావరి ఘాట్, ఇస్కాన్ ఆలయాన్ని చూసి రాత్రి అక్కడే బస చేస్తారు.

03వ రోజు ఆదివారం హోటల్‌లో చెక్ అవుట్ చేసి అంతర్వేదికి బయలుదేరుతారు. అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం తర్వాత బీచ్‌ను సందర్శిస్తారు. తర్వాత శ్రీ బాల బాలాజీ ఆలయం, అప్పనపల్లి, విఘ్నేశ్వర ఆలయం, అయినవల్లి చూస్తారు. సాయంత్రం ద్రాక్షారామం ఆలయ దర్శనం చేసుకొని రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో చేరుకొని 08:18 గంటలకు రైలు నంబర్ 12737 (గౌతమి ఎక్స్‌ప్రెస్)లో తరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రంతా ప్రయాణం తర్వాత 04వ రోజు సోమవారం ఉదయం సికింద్రాబాద్‌కు 04:35 గంటలకు, లింగంపల్లికి 05:55 గంటలకు చేరుకుంటారు. దీంతో టూర్ మోగిస్తుంది.

ఈ టూర్ ప్యాకేజ్ టికెట్ ధరల విషయానికి వస్తే.. 1 నుంచి 3 ప్రయాణీకులు ఉంటె ప్యాకేజీ టారిఫ్ ప్రతి వ్యక్తికి కంఫర్ట్ (3AC)లో సింగిల్ షేరింగ్ రూ. 15340, ట్విన్ షేరింగ్ రూ. 8940, ట్రిపుల్ షేరింగ్ రూ. 7170, 5-11 సంవత్సరాలు పిల్లలకు విత్ బెడ్ రూ. 6080, విత్అవుట్ బెడ్ రూ. 4960గా ఉంది. అలాగే స్టాండర్డ్ (SL)లో సింగిల్ షేరింగ్ రూ. 13800, ట్విన్ షేరింగ్ రూ. 7400, ట్రిపుల్ షేరింగ్ రూ. 5630, 5-11 సంవత్సరాలు పిల్లలకు విత్ బెడ్ రూ. 4540, విత్అవుట్ బెడ్ రూ. 3420గా ఫిక్స్ చేసారు. ఒకవేళ 4 నుంచి 6 ప్రయాణీకులు ఉంటె ప్యాకేజీ టారిఫ్ తగ్గుతుంది. ఇందులో ప్రతి వ్యక్తికి కంఫర్ట్ (3AC)లో ట్విన్ షేరింగ్ రూ. 7440, ట్రిపుల్ షేరింగ్ రూ. 6630, 5-11 సంవత్సరాలు పిల్లలకు ఏమి మారలేదు. అలాగే స్టాండర్డ్ (SL)లో ట్విన్ షేరింగ్ రూ. 5900, ట్రిపుల్ షేరింగ్ రూ. 5630, 5-11 సంవత్సరాలు పిల్లలకు అదే టారిఫ్ ఉంది.




