ఫ్యాన్సీ నెంబరా మజాకా.. ‘9999’ నెంబర్.. ఎంత పలికిందో తెల్సా
తాము ఎంతో ఇష్టంగా కొనుక్కున్న వాహనాలకు.. ఫ్యాన్సీ నెంబర్లు ఉండాలని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. సెంటిమెంట్ అని కొందరు, ప్రత్యేక గుర్తింపు కోసం ఇంకొందరు.. తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడుతూ ఉంటారు. వ్యాపారవేత్తలు, సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఈ లిస్ట్‌లో ముందు వరసలో ఉంటారు.
తాజాగా తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో ఒక ఫ్యాన్సీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ రికార్డు స్థాయి ధర పలికింది. హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని జిల్లా రవాణా కార్యాలయంలోని RTA అధికారులు “TGA 03A 9999” రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఆన్‌లైన్ టెండర్లను ఆహ్వానించారు. ప్రభుత్వ బేస్ ప్రైజ్ రూ.50,000గా నిర్ణయించగా.. బిడ్డింగ్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. మే 27, మంగళవారం జరిగిన ఆన్‌లైన్ వేలంలో హనుమకొండలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం రూ.12.60 లక్షలు కోట్ చేసి అత్యధిక బిడ్‌తో నంబర్ దక్కించుకుంది. ఇంకా చాలామంది రూ. 12 లక్షల వరకు బిడ్లను సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ రేంజ్‌లో పోటీ ఉందంటే ఫ్యాన్సీ నంబర్లపై జనాలకు ఎంత మోజు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ సైతం TG09 F0001 ఫ్యాన్సీ నంబరును అత్యధిక ధర పెట్టి దక్కించుకున్నారు. ఆన్‌లైన్‌లో జరిగిన వేలంలో 0001 నంబరును రూ.7.75లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. త్వరలో ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోబోయే బీఎండబ్ల్యూ వాహనం కోసం ఈ నంబర్ దక్కించుకున్నట్లు తెలిసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
5 సబ్జెక్టుల్లో 100కు 90కి పైగా మార్కులు.. సోషల్ ఫెయిల్.. రివాల్యుయేషన్ పెట్టగా
పాము పుట్టకు సమీపంలో ఫోన్ పెట్టి నాగినీ ట్యూన్ ప్లే చేశారు.. కాసేపటికి
బతకదు అనుకున్న భార్యను బతికించుకున్నాడు.. ఆటా పాటా అద్భుతమే చేశాయి
దారుణం.. పీరియడ్స్ అని సెలవు అడిగితే.. రుజువు అడిగారు
బంగారంతో నేసిన చీరలో నీతా అంబానీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
