దారుణం.. పీరియడ్స్ అని సెలవు అడిగితే.. రుజువు అడిగారు
ఒక విద్యార్థిని తనకు పీరియడ్స్ సెలవు కావాలని కోరటంతో..సంబంధిత విశ్వవిద్యాలయం ఆమె బట్టలు విప్పేసి రుజువు చూపించమని కోరింది. ఈ దారుణ సంఘటన డ్రాగన్ కంట్రీ చైనాలో చోటు చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. చైనాలోని బీజింగ్‌లోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం మహిళా విద్యార్థులకు వారి రుతుక్రమ సెలవు ఇవ్వాలంటే సరైన ఆధారం చూపించాలని డిమాండ్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి.
ఈ సంఘటన బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన గెంగ్డాన్ ఇన్స్టిట్యూట్‌లో జరిగింది. మే 15న ఒక విద్యార్థి తన అనుభవాన్ని వివరిస్తూ ఆన్‌లైన్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సంఘటన తర్వాత విశ్వవిద్యాలయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సెలువు కావాలంటే సదరు విద్యార్థిని క్యాంపస్ క్లినిక్‌లో బట్టలు విప్పి పరీక్ష చేయించుకోవాలని కోరినట్టుగా బాధిత యువతి వీడియోలో ఆరోపించింది. వీడియోలో ఆ విద్యార్థిని పిరియడ్స్ సమయంలో అందరూ బట్టలు విప్పి రుజువు చూపించాల్సిన అవసరం ఉందా అని సిబ్బందిని అడిగినట్టుగా చెప్పింది.. అందుకు సిబ్బంది నుంచి అవును అనే సమాధానం వచ్చిందని, ఇది కళాశాల నియమం అని తనది కాదంటూ సిబ్బంది చెప్పిన విషయాన్ని బాధిత యువతి వెల్లడించింది. ఇందుకు గానూ ఆ విద్యార్థిని ఇలాంటి రూల్స్‌కి సంబంధించి లిఖిత పూర్వక కాపీని ఇవ్వమని అడిగితే.. సిబ్బంది ఇవ్వలేదని చెప్పింది. తనకు ఎదురైన ఇలాంటి అనుభవాన్ని బాధిత యువతి సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజేసింది. దీంతో వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఇంటర్‌నెట్ వేదికగా తీవ్ర దుమారం రేపుతోంది. వివాదం తీవ్ర రూపం దాల్చటంతో, విశ్వవిద్యాలయం సిబ్బందిని సమర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సిబ్బంది నిబంధనల ప్రకారం పనిచేశారని చెప్పింది. ఈ నిబంధన చాలా కాలంగా అమలులో ఉందని, విద్యార్థులు సెలవులను దుర్వినియోగం చేస్తున్నారని, అందువల్లే ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టుగా విశ్వవిద్యాలయం తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారంతో నేసిన చీరలో నీతా అంబానీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ప్రశాంతంగా టాయిలెట్ సీట్ మీద కూర్చున్నాడు.. ఈ లోపే బస్సుమంటూ పైకిలేచింది
బామ్మ మజాకా.. కజరారే.. పాటకు కత్తిలాంటి స్టెప్స్.. చూసిన వాళ్లకి మైండ్ బ్లాంక్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

