ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగండి..ఫలితం మీరే చూడండి
మానవ ఆరోగ్యానికి పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఎంతగానో దోహదం చేస్తాయి. అందుకే వైద్యులు ఎక్కువగా వీటిని తీసుకోమని సూచిస్తుంటారు. పండ్లు, కూరగాయలను జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఎన్నో పోషకాలు నేరుగా శరీరానికి అందుతాయి. వాటిలో బీట్‌రూట్ జ్యూస్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. బీట్‌రూట్‌లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి.
ఇవి రక్తనాళాలను విశాలం చేసి, రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బులను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బీటాసైనిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఇందులో ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. బీట్‌రూట్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా చేస్తుంది. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. బీట్‌రూట్‌లో ఉండే బీటైన్ అనే పోషకం కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యల నివారణలో సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే సహజ చక్కెరలు రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. బీట్‌రూట్ జ్యూస్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బీట్‌రూట్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

