వీధి శునకాలే ఆమె నేస్తాలు.. ఆకట్టుకుంటున్న చిన్నారి వీడియో
పసివాళ్లు దేవుడితో సమానమంటారు. కల్మషం లేని ఆ లేత మనసులు అందరితో ఇట్టే స్నేహం చేస్తాయి. అలా ఓ చిన్నారి వీధిశునకాలతో స్నేహం చేసింది. వాటికి ఆ పాప.. బెస్ట్ ఫ్రెండ్.. కేర్ టేకర్ కూడా. ఇంకా చెప్పాలంటే తను వాటికి కమాండర్. తను వెళ్తుంటే ఆ శునకాలు బాడీ గార్డ్స్‌లా ఆమె వెంటే వెళ్తాయి. అంతేకాదు ఆ చిన్నారి ఆ శునకాలే వాహనంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది.
ఈ అద్భుతమైన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కల్మషం లేని మనసులకు ప్రతిరూపం ఈ వీడియో అని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. జీవితంలో అనురాగాన్ని పంచడం ఎంత ముఖ్యమో గుర్తుచేసిందంటున్నారు. ఈ వీడియోలో, ఓ చిన్నారి వీధిలో ఉన్న కుక్కలను స్నేహపూర్వకంగా తడుముతూ, వాటితో ఆడుకుంటూ కనిపిస్తుంది. ఓ కుక్క కూడా బాలిక ప్రేమకు ప్రతిస్పందిస్తూ సంతోషంతో తలూపడం చూడొచ్చు. ఈ దృశ్యం చూడటానికి ఎంతో అందంగా ఉంది. నెటిజన్లు ఆ చిన్నారి, కుక్కకు మధ్య ఉన్న స్వచ్ఛమైన అనుబంధాన్ని చూసి ఫిదా అవుతున్నారు. నెటిజన్ల కామెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకరు ఈ వీడియో చూసి, ఎలాంటి గజిబిజీ లేని పసి మనుషులు.. ఈ లోకాన్ని మర్చిపోయి ప్రేమలో మునిగిపోయారు అని వ్యాఖ్యానించారు. అలాగే ఈ దృశ్యం చాలాకాలం నా మనసులో నాటుకుపోతుందని మరొకరు ప్రశంసించారు. అయితే ఈ వీడియోలోని చిన్నారి ఎవరు, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని స్పష్టమైన సమాచారం లేదు. కానీ వీడియో మాత్రం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దోష పరిహారమా ?? కామాఖ్య ఆలయంలో ఆషు రెడ్డితో.. పూజలు చేయించిన వేణుస్వామి
గుడ్ న్యూస్ చెప్పిన కమెడియన్ !!
విజయశాంతి ఎవరో కాదు.. రియల్ లైఫ్‌లో బాలయ్యకు కోడలు అవుతుంది
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

