Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోష పరిహారమా ?? కామాఖ్య ఆలయంలో ఆషు రెడ్డితో.. పూజలు చేయించిన వేణుస్వామి

దోష పరిహారమా ?? కామాఖ్య ఆలయంలో ఆషు రెడ్డితో.. పూజలు చేయించిన వేణుస్వామి

Phani CH

|

Updated on: Jun 03, 2025 | 7:23 PM

జూనియర్ సమంతగా ఆషూ రెడ్డికి టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాష్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ మొదట బుల్లితెరపై అడుగు పెట్టింది. బిగ్ బాస్ రియాలిటీ షోతో సహా పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేసింది. కొన్ని సినిమాల్లోనూ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది.

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే యాంకర్ గా టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆసుపత్రి పాలైంది. అయితే ధృడ సంకల్పంతో తిరిగి కోలుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించింది. ఆషూ రెడ్డికి దైవ చింతన కాస్త ఎక్కువే. గతంలో పలు ప్రముఖ దేవాలయాలను సందర్శించుకుందీ అందాల తార. తాజాగా అస్సాంలోని ప్రముఖ కామాఖ్య ఆలయాన్ని దర్శించకుంది ఆషూ. అక్కడ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ విషయం కాస్తా బయటికి వచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడే కాదు గతంలోనూ .. వేణు స్వామితో కలిసి పలు ప్రత్యేక పూజలు నిర్వహించింది ఆషూ రెడ్డి. ఈ క్రమంలోనే ఈసారి ప్రముఖ కామాఖ్య ఆలయంలో వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది ఆ బ్యూటీ. అయితే సెలబ్రిటీలకు జాతకాలు చూసే వేణు స్వామి.. వారికి ఏమైనా దోషాలు ఉన్నట్లయితే పరిహారంగా ఇలాంటి పూజలు నిర్వహిస్తుంటాడు. ఇప్పుడు ఆషూ రెడ్డితో కలిసి అలాంటి పూజలే చేయించాడా? అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని నెట్టింట పోస్టులు రూపంలో కన్వే చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్ న్యూస్ చెప్పిన కమెడియన్ !!

విజయశాంతి ఎవరో కాదు.. రియల్ లైఫ్‌లో బాలయ్యకు కోడలు అవుతుంది

దిలావర్ సింగ్ భార్యను.. నేను కాదు మొర్రో అంటే వినరే..!

మహేష్ కోసం పోటీపడుతున్న.. ముగ్గురు స్టార్ డైరెక్టర్స్‌

సినిమా కొట్టింది.. కార్‌ పట్టుకెళ్లింది! ఆకాంక్ష సింగ్ ఆగట్లేదుగా