బంగారంతో నేసిన చీరలో నీతా అంబానీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నీతా అంబానీ... తను ధరించే దుస్తులతోనూ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. అకేషన్‌కు తగినట్లుగా చీరలు, ఆభరణాలను స్పెషల్‌గా డిజైన్ చేయించుకునే ఆమె.. మీడియాకు కనిపించిన ప్రతిసారి అటెన్షన్ క్యాచ్ చేస్తారు. ముఖ్యంగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో ధరించిన అవుట్‌ఫిట్స్‌తో అమేజింగ్ అనిపించారు.
అంతెందుకు పెంపుడు కుక్క డ్రెసింగ్ విషయంలోనే జాగ్రత్తలు తీసుకునే నీతా అంబానీ.. తన చీరల విషయంలో ఎంత శ్రద్ధ చూపుతారో చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే గోల్డెన్ శారీలో కనిపించి అదరగొట్టిన ఆమె.. లుక్స్‌తో వావ్ అనిపించారు. కానీ ఆ చీర ధరతో షాక్ ఇచ్చారు. అవును… గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ శారీలో తళుక్కుమన్నారు ఈ బిలియనీర్. ఇక బంగారంతో నేసిన చీర విలువ అక్షరాలా మూడున్నర కోట్లకు పైనే. కాగా ఈ విషయం తెలిసి నెటిజన్లు అవాక్కయ్యారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటే ఇదేనేమో అంటున్నారు. ‘ఇందులో వింతేముంది?’, ‘ మనీ మిస్ యూజ్ చేస్తుంది’, ‘అయితే ఏం చేద్దాం’, ‘స్కామ్‌డ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో ఎప్పటిలాగే ఆమెకు బాగా సూట్ అయిందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ప్రముఖ డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా ఈ చీరను డిజైన్ చేసారు. బంగారు పోగులతో పాటు సంప్రదాయ నఖాషీ అలాగే జర్దోసీ ఎంబ్రాయిడరీని చీరలో అందించారు. వీటితో పాటు ఎంతో ఖరీదైన స్వరోవ్ స్కీ క్రిస్టల్స్‌తో తళుకులీనేలా రూపొందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రశాంతంగా టాయిలెట్ సీట్ మీద కూర్చున్నాడు.. ఈ లోపే బస్సుమంటూ పైకిలేచింది
బామ్మ మజాకా.. కజరారే.. పాటకు కత్తిలాంటి స్టెప్స్.. చూసిన వాళ్లకి మైండ్ బ్లాంక్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

