Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. పాములతో కలిసి జీవిస్తున్న గ్రామస్తులు వీడియో

వామ్మో.. పాములతో కలిసి జీవిస్తున్న గ్రామస్తులు వీడియో

Samatha J

|

Updated on: Jun 04, 2025 | 6:29 PM

భూమ్మీద సంచరించే జీవుల్లో పాములు అంటార్కిటికా మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. విషపూరిత పాములు, విషం లేని పాములు వీటిలో ఉండటం చూస్తాం. అయితే పాము అన్న శబ్దం వింటే చాలు అది ఏ రకమైన పాము అని చూడరు అక్కడినుంచి ఆ మనిషి దూరం పారిపోతాడు. అదే నాగపాము అయితే భయంతో సగం మంది గుండె ఆగిపోతుంది. మరి అలాంటిది విష సర్పాల మధ్య మనుషులు జీవిస్తుంటే అమ్మో ఇది అసలు సాధ్యమేనా అని అనుకుంటారు. అయితే మన దేశంలో సైన్స్ కే సవాల్ విసిరుతున్న గ్రామం ఒకటుంది. ఇందులో మనుషులు పాములు కలిసి మెలిసి జీవించడం చూస్తాం.

ఆ గ్రామం ఎక్కడుంది? పాము కరిస్తే వారు ఏం చేస్తారో ఈ స్టోరీలో చూద్దాం. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని చెట్ఫాల్ గ్రామాన్ని విలేజ్ ఆఫ్ సర్పెంట్స్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ విషపూరిత కోబ్రా పాములు మానవులు ఒకే పైకప్పు కింద ప్రశాంతంగా నివసిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక్కడ పాములను కుటుంబ సభ్యుల్లో భాగంగా గుర్తిస్తారు. ఈ ప్రత్యేక అనుబంధం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను పరిశోధకులను ఆకర్షిస్తుంది. చెట్ఫాల్ గ్రామంలోని ప్రతి ఇంట్లో కోబ్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దీన్ని దేవస్థానం అని పిలుస్తారు. అది ఒక రంధ్రం, మూల లేదా పాములు స్వేచ్ఛగా తిరగాడే స్థలం ఏదైనా కావచ్చు. నాగపాములు ఇష్టానుసారంగా ఇళ్లల్లోకి వచ్చి వెళతాయి. గ్రామస్తులు వాటిని ఏమీ చేయరు. బదులుగా గౌరవించి పూజిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే చెట్ఫాల్లో పాము కరిచి మరణించిన వారు ఇప్పటివరకు లేరు. పాముకాటు సంఘటనలు కూడా ఇప్పటివరకు నమోదు కాలేదు. ఇది ఈ గ్రామాన్ని మరింత మిస్టరీగా మారుస్తుంది. 2500 మంది గ్రామస్తులు అంతకంటే ఎక్కువ సంఖ్యలో పాములు సామరస్యంగా సహజీవనం చేసే సంధర్భం సైన్స్ కే సవాల్ విసిరుతుంది. చెట్ఫాల్లో పిల్లలు పాములకు అస్సలు భయపడరు వాటితో ఆడుకుంటారు. పాములు పాఠశాలల్లో, దుకాణాలలో ఇళ్లల్లో స్వేచ్ఛగా తిరుగుతాయి.

మరిన్ని వీడియోల కోసం :

ఈమెలా పెళ్లి చేసుకోండి ..హలో బాయ్స్‌ .. గర్ల్స్ వీడియో

ఆరేళ్ల చిన్నారికి జీవితాన్నిచ్చిన వైద్యులు..ఏం జరిగిందంటే వీడియో

రోజూ గుప్పెడు పల్లీలు తింటే చాలు..ఆశ్యర్యపోయే ప్రయోజనాలు వీడియో