Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈమెలా పెళ్లి చేసుకోండి ..హలో బాయ్స్‌ .. గర్ల్స్ వీడియో

ఈమెలా పెళ్లి చేసుకోండి ..హలో బాయ్స్‌ .. గర్ల్స్ వీడియో

Samatha J

|

Updated on: Jun 01, 2025 | 11:11 PM

పెళ్ళి అంటే మధుర క్షణాల సమ్మేళనం. కానీ ఆ పెళ్లి వేడుక పర్యావరణానికి హాని కలగకూడదని నిరూపించింది. చెన్నైకి చెందిన లైఫ్ స్టైల్ బ్లాగర్ ఉమా రాఘవన్ అతి తక్కువ వ్యర్థాలతో చెప్పాలంటే జీరో వేస్ట్ తో పెళ్లి చేసుకుంది ఆమె. మనోళ్ళకు పెళ్ళి అంటే ముందుగా గుర్తువచ్చేది మంచి దావత్. తీరని వంటకా లతో పసందైన విందు ఇవ్వాలనుకుంటారు. పెళ్లి ఎంత గ్రాండ్ గా అయిందనేది వంటకా ల మీదే ఆధారపడి ఉంటుందనుకుంటారు. ఉమా పెళ్లి విషయంలో కూడా అదే జరిగింది. వంటకా ల ప్రిపరేషన్ కోసం ఫ్యామిలీ అంతా తలమునకలైతే ఉమా అవేవీ వద్దని అనేసింది. ఫ్యామిలీ షాక్ అయింది. వంటలు లేనిదే పెళ్లి ఎక్కడిది అన్నారు.

వంటలు వద్దని చెప్పడం లేదు. వ్యర్థాలు తగ్గిద్దాం అని కుటుంబానికి వరుడి ఇంటి వాళ్ళకు సమదాయిచి చెప్పింది ఉమా. కనెక్ట్ టు ఎర్త్ అనే ఎన్ జి ఓ సహాయంతో పెళ్ళిలోని భోజన వ్యర్థాలను వెటర్నరీ వైద్యుని పర్యవేక్షణలో పశువులకు ఆహారంగా అందించింది. ఎండిన పూల దండలు, మావిడాకులు, పండ్ల తొక్కలను తడి పొడి వ్యర్థాలుగా విభజించి ఎరువుగా మార్చింది. ఉమా రాఘవన్ తన పెళ్ళిలో మొత్తం 110 కిలోల వ్యర్థాలను మళ్ళించి తక్కువ వ్యర్థాలతో పెళ్లి చేసుకుంది. కాటరింగ్ బృందం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను కొనుగోలు చేసింది. కానీ ఉమా వెనక్కి తగ్గలేదు. మిగిలిన నీటిని మొక్కలకు పారబోసి ప్లాస్టిక్ బాటిల్స్ ను రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించింది. ఈ విధంగా అతిథులకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడటం కోసం మంచి ప్రయత్నమే చేసింది.