ఆరేళ్ల చిన్నారికి జీవితాన్నిచ్చిన వైద్యులు..ఏం జరిగిందంటే వీడియో
ఆ చిన్న పాప ఎంతో యాక్టివ్. తల్లిదండ్రులకు తనంటే ఎంతో ఇష్టం. తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని భావించి ఎంతో చక్కగా చూసుకుంటున్నారు. కాగా పాపకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు వెన్నుముక సహజ ఆకారాన్ని తప్పిపోయి వంగి ఉండటాన్ని తల్లి గమనించింది. మొదట్లో అంత పెద్ద సమస్య ఏం కాదులే అనుకున్నారు. కాలక్రమేణా అది మరింత స్పష్టంగా కనిపించింది. దీంతో పాప తల్లిదండ్రులు చాలా మంది డాక్టర్లను సంప్రదించారు. దాంతో ఆ పరిస్థితిని స్కోలియోసిస్ గా నిర్ధారించారు. అంటే వెన్నుముక సరిగ్గా సూటిగా ఉండకుండా ఎస్ లేదా సి ఆకారంలో వంగిపోవడం. దీంతో పాప భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని పేరెంట్స్ ఆందోళన చెందారు.
ఏ ఆస్పత్రి నుంచి కూడా వారికి స్పష్టమైన హామీ దొరకలేదు. పాపకు ఆరేళ్ల వయసు వచ్చినప్పుడు ఒక సపోర్ట్ గ్రూప్ ద్వారా తల్లిదండ్రులకు సమాధానం దొరికింది. ఆన్ లైన్ కమ్యూనిటీలో ఓ వ్యక్తి తనకు విజయవంతంగా జరిగిన స్కోలియోసిస్ సర్జరీ గురించి వివరించడంతో వారికి కొత్త ఆశ చిగురించింది. ఆ ఆశతో వారు బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో స్పైన్ సర్జరీ నిపుణుడు డాక్టర్ ఎస్ విద్యాధరన్ ను సంప్రదించారు. పాపకు పరీక్షలు చేసిన డాక్టర్ ఆమె వెన్నుపూస 86 డిగ్రీల వక్రతతో ఉన్నట్లు గుర్తించారు. ఇది థొరాసిక్ స్కోలియోసిస్ అనే వ్యాధి.
Published on: Jun 01, 2025 10:44 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
