బతకదు అనుకున్న భార్యను బతికించుకున్నాడు.. ఆటా పాటా అద్భుతమే చేశాయి
చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన 30 ఏళ్ల డెంగ్ యూకాయ్. తన భార్య యే మెయిడీ ప్రాణాంతక కేన్సర్‌తో పోరాడుతున్నా..ఆమె చేయిని వదలలేదు. ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తిగా తనకే అంకితమై కంటిపాపలా కాచుకున్నాడు. అయితే ఆ కేన్సర్..డెంగ్ ప్రేమను ముక్కలు చేసేలా విజృభించి భార్యను కోమాలోకి వెళ్లిపోయిలా చేసింది.
డాక్టర్లు సైతం చేతులెత్తేసిన వేళ కూడా.. తన ప్రేమతోనే భార్యను బతికించుకోవాలనుకున్న ఓ గొప్ప భర్త స్టోరీ ఇది. డెంగ్, మెయిడీల ప్రేమ కథ తొమ్మిదేళ్ల క్రితం ఓ స్నేహితుడి వివాహంలో ప్రారంభమైంది. మెయిడీ తీవ్ర బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతోంది. ఆ విషయం తెలిసినప్పటికీ.. ఆమెనే ప్రేమించాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడు డెంగ్. మెయిడీ తన ప్రేమను అంగీకరించేంత వరకు ఆమె చుట్టూనే తిరిగాడు. అయితే మెయిడీ తనెంతో కాలం బతకననే ఉద్దేశ్యంతో అతడి ప్రేమను అంగీకరించలేదు. కానీ డెంగ్ తనను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. అలా వారిద్దరూ ఆరేళ్ల క్రితం వివాహబంధంతో ఒక్కటయ్యారు. వారికి హన్హాన్ అనే కుమార్తె జన్మించింది. ఏడాది తర్వాత మెయిడీ పరిస్థితి క్షీణించటం ప్రారంభమైంది. కోమాలో చేరువైపోయే స్థితికి చేరుకుంది. ఆ సమయంలో మెయిడీ తన చికిత్స కోసం ఖర్చు చేయొద్దని..లాభం లేదని భర్త డెంగ్‌కి చెప్పేసింది. ఎందుకంటే అప్పటికే డెంగ్ ఆమె వైద్యం కోసం దాదాపు రూ. 2 కోట్లుపైనే ఖర్చుపెట్టేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకుపూర్తిగా కోమాలోకి వెళ్లిపోయింది మెయిడీ. మెయిడీని ఇంటికి తీసుకువచ్చి..కుటుంబసభ్యులతో వీడ్కోలు పలికిస్తూ వీడియో తీసాడు. సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అంతే నెట్టింట డెంగ్‌కి భారీగా విరాళాలు వచ్చాయి. దాంతో భార్యను తిరిగి ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించాడు. అంతే జస్ట్ మూడు నెలల్లో మెయిడీ కోలుకోవడం..మళ్లీ యథావిధిగా మాట్లాడటం ప్రారంభించింది. అంతేగాదు ఆ మూడు నెలలు డెంగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి..ఆమెకు పూర్తికాలం సంరక్షకుడిగా కంటికి రెప్పలా చూసుకున్నాడు. అంతేగాదు స్ప్రుహలోకి వచ్చేలా ఆమె ముందు పాడుతూ..డ్యాన్స్ చేస్తూ..ఉత్సాహాం నింపేవాడు. దాంతో మెయిడీ ఏదో మిరాకిల్ చేసినట్లుగా కోలుకుంది. ఇప్పుడామె భర్తకు ఆర్థిక తోడ్పాటును అందించేలా వీధి దుకాణం నడుపుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం.. పీరియడ్స్ అని సెలవు అడిగితే.. రుజువు అడిగారు
బంగారంతో నేసిన చీరలో నీతా అంబానీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ప్రశాంతంగా టాయిలెట్ సీట్ మీద కూర్చున్నాడు.. ఈ లోపే బస్సుమంటూ పైకిలేచింది
బామ్మ మజాకా.. కజరారే.. పాటకు కత్తిలాంటి స్టెప్స్.. చూసిన వాళ్లకి మైండ్ బ్లాంక్

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
