పాము పుట్టకు సమీపంలో ఫోన్ పెట్టి నాగినీ ట్యూన్ ప్లే చేశారు.. కాసేపటికి
గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. పాములు పట్టేవాళ్లు బుట్టల్లో పాములు పెట్టుకొని వచ్చి బూర ఊదుతూ వాటితో నాట్యం చేయిస్తుంటారు. అది వారి జీవనాధారం. ఇప్పుడు ఇలాంటివన్నీ కనుమరుగైపోయాయి. టెక్నాలజీ యుగంలో అన్నీ టెక్నికల్‌గానే జరుగుతున్నాయి. ఇప్పడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటోంది.
ఇప్పుడు ఈ పాములు పట్టేవారికి కూడా బూర ఊదే కష్టం తప్పింది. సెల్‌ఫోన్‌లో చక్కటి ట్యూన్ పెట్టి పాములను పట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఓ వీడియోలో కొంత మంది బీహారీ అబ్బాయిలు ఇలానే ప్రయత్నించగా, ఆ వీడియో ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు మరో కొత్త వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందులో కొంత మంది అబ్బాయిలు.. పామును పుట్ట నుంచి బయటికి రప్పించేందుకు.. మొబైల్‌లో నాగిని ట్యూన్ ప్లే చేశారు. పుట్ట సమీపంలోని చెట్టు వద్ద ఫోన్ ఉంచి.. ఆ ట్యూన్ ప్లే చేశారు. సమీప ప్రాంతాల్లో పుట్టను రికార్డు చేసేలా మరో ఫోన్ పెట్టారు. కాసేపటికి ఆశ్చర్యకరంగా పాము బయటికి వచ్చి.. ట్యూన్‌కు అనుగుణంగా కదలడం వీడియోలో రికార్డు అయింది. ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. కోటిన్నరమంది ఈ వీడియోను వీక్షించారు. లక్షలమంది లైక్ చేశారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మన దేశంలో ఇంత తెలివైన వాళ్లు ఉన్నారంటే గర్వంగా ఉందని కొందరు, మీ సోషల్ మీడియా పిచ్చి తగలెయ్య.. వాటిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు కదారా ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే, పాములు శబ్దాలను వినలేవు.. అవి భూమి ద్వారా వచ్చే వైబ్రేషన్లను మాత్రమే గుర్తించగలవు. బూర ఊదేటప్పుడు.. కదలికలను చూసి పాములు తన శరీరాన్ని కదిలిస్తాయి. అంతే కానీ ఇలా ఏం ఉండదు.. ఇది ఓ కల్పిత వీడియో అని నిపుణులు కొట్టిపారేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బతకదు అనుకున్న భార్యను బతికించుకున్నాడు.. ఆటా పాటా అద్భుతమే చేశాయి
దారుణం.. పీరియడ్స్ అని సెలవు అడిగితే.. రుజువు అడిగారు
బంగారంతో నేసిన చీరలో నీతా అంబానీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ప్రశాంతంగా టాయిలెట్ సీట్ మీద కూర్చున్నాడు.. ఈ లోపే బస్సుమంటూ పైకిలేచింది
బామ్మ మజాకా.. కజరారే.. పాటకు కత్తిలాంటి స్టెప్స్.. చూసిన వాళ్లకి మైండ్ బ్లాంక్

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
