Walnut Benefits: ప్రతిరోజూ ఉదయాన్నే వాల్‌నట్స్‌ తినడం వల్ల మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే వాల్ నట్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. వాల్‌నట్స్‌లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ - బి, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉండే ఆహార పదార్థాల్లో వాల్‌నట్స్ ఒకటి.

Walnut Benefits: ప్రతిరోజూ ఉదయాన్నే వాల్‌నట్స్‌ తినడం వల్ల మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
Walnuts
Follow us

|

Updated on: Feb 27, 2024 | 3:43 PM

మనం రోజూ ఉదయం తినే ఆహారం మన ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ప్రతి రోజూ ఉదయాన్నే ఆరోగ్యానికి హాని కలిగించని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రతి రోజూ ఉదయం వాల్ నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాల్‌నట్స్‌లో చాలా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాల్‌నట్‌లో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే వాల్ నట్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. వాల్‌నట్స్‌లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ – బి, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉండే ఆహార పదార్థాల్లో వాల్‌నట్స్ ఒకటి.

బరువు తగ్గడం: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయాన్నే వాల్‌నట్స్ తినడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. వాల్ నట్స్ లో ఉండే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఫలితంగా, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

దృఢమైన ఎముకలు: వాల్‌నట్స్‌లో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరాన్ని దృఢంగా ఉంచడంలో మేలు చేస్తుంది. రోజూ ఉదయాన్నే వాల్‌నట్స్‌ తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. వాల్‌నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఎముకలను దృఢంగా ఉంచేందుకు ఇది చాలా మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ ప్రమాదం: నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది.

మెదడు: వాల్‌నట్స్‌లో మెదడు బాగా పని చేసే కొన్ని పోషకాలు ఉంటాయి. ఒత్తిడి భావాలను తగ్గిస్తుంది. మెదడు ఆకారంలో ఉండే వాల్ నట్స్ జ్ఞాపకశక్తికి పదును పెట్టడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఏకాగ్రతను పెంచుతుంది.

మలబద్ధకం: మీరు మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతుంటే ఖచ్చితంగా వాల్ నట్స్ తీసుకోవాలి. పొటాషియం, జింక్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు నిండుగా ఉండే వాల్‌నట్‌లు తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ రుగ్మతల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

డయాబెటిస్‌కు: రోజూ 3 నుంచి 4 వాల్ నట్స్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 3 నుండి 4 వాల్‌నట్స్ తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..