యాపిల్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది… కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..! అవేంటో తెలిస్తే..
కొందరికి యాపిల్స్ అలెర్జీని ఇస్తాయి. మీకు కూడా అలాంటి ఇబ్బందులు ఉంటే తినకపోవడమే మంచిది. యాపిల్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. కానీ ఎక్కువ మోతాదులో తింటే బరువు పెరిగేలా చేస్తాయి. యాపిల్స్ ఉండే ఫైబర్ కొంతమందికి గ్యాస్ సమస్యకు దారితీస్తుంది. యాపిల్స్ లో కేలరీలు అధికం. కనుక ఎక్కవ తినడం వల్ల బరువు పెరుగుతారు.

రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదు అని అంటారు. ఈ మాట మనం తరచూ వింటూనే ఉంటాం. సీజన్స్ తో సంబంధం లేకుండా యాపిల్స్ తినటం వల్ల అంతే ప్రయోజనాలు కలిగి ఉంటాయని వైద్యులు సైతం చెబుతుంటారు. యాపిల్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. క్రమంగా ఇది అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యల్ని పోగొడుతుంది. కానీ, యాపిల్స్ అతిగా తినటం వల్ల కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యాపిల్స్ ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎక్కువగా తింటే దుష్ర్పభావాలు తప్పువు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. యాపిల్స్ తినడం వల్ల కొంతమందికి అలెర్జీ కలిగిస్తుంది. దద్దుర్లు, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి. యాపిల్స్‌లో సహజమైన షుగర్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా యాపిల్స్‌ని జ్యూస్ రూపంలో తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాపిల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
యాపిల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది. యాపిల్స్ అతిగా తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, క్రాంప్స్, మలబద్ధకం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. క్రిమిసంహారక మందులు ఎక్కువగా వాడిన యాపిల్స్ తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. యాపిల్స్‌లో ఆమ్లాలు దంత ఎనామెల్‌ను నాశనం చేస్తాయి. ఇది దంత క్షయానికి దారితీస్తుంది. ఖాళీ కడుపతో యాపిల్స్ తింటే కొంతమందిలో అజీర్ణానికి కారణమవుతుంది.
యాపిల్ తిన్న వెంటనే నోటిని కడుక్కోవాలని లేదంటే పంటి సమస్యలు వచ్చే అవకాశముందని చెప్తున్నారు. కొందరికి యాపిల్స్ అలెర్జీని ఇస్తాయి. మీకు కూడా అలాంటి ఇబ్బందులు ఉంటే తినకపోవడమే మంచిది. యాపిల్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. కానీ ఎక్కువ మోతాదులో తింటే బరువు పెరిగేలా చేస్తాయి. యాపిల్స్ ఉండే ఫైబర్ కొంతమందికి గ్యాస్ సమస్యకు దారితీస్తుంది. యాపిల్స్ లో కేలరీలు అధికం. కనుక ఎక్కవ తినడం వల్ల బరువు పెరుగుతారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..