AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లగా ఉన్నాయని చిన్నచూపు చూసేరు.. పవర్‌ఫుల్ వయాగ్రా.. ఆ విషయంలో రెచ్చిపోతారట..

కౌంచ్.. ఇది ఒక చిన్న విత్తనంలా కనిపిస్తుంది.. కానీ దీనిలో గొప్ప శక్తి వనరు.. అంతేకాకుండా.. ఆరోగ్యానికి మేలు చేసే అనేక లక్షణాలు దాగున్నాయి. ఇది మన ఆరోగ్యానికి ఒక ఔషధ నిధిలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కౌంచ్ విత్తనాలు శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు.

నల్లగా ఉన్నాయని చిన్నచూపు చూసేరు.. పవర్‌ఫుల్ వయాగ్రా.. ఆ విషయంలో రెచ్చిపోతారట..
Benefits Of Kaunch Seeds
Shaik Madar Saheb
|

Updated on: Jul 05, 2025 | 2:09 PM

Share

కౌంచ్.. ఇది ఒక చిన్న విత్తనంలా కనిపిస్తుంది.. కానీ దీనిలో గొప్ప శక్తి వనరు.. అంతేకాకుండా.. ఆరోగ్యానికి మేలు చేసే అనేక లక్షణాలు దాగున్నాయి. ఇది మన ఆరోగ్యానికి ఒక ఔషధ నిధిలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కౌంచ్ విత్తనాలు శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. కౌంచ్.. తీగ రూపంలో పెరిగే ప్రత్యేక ఔషధ మొక్క.. దీని విత్తనాలు గోధుమ, నలుపు రంగులో ఉంటాయి. కౌంచ్ విత్తనాలను భారతదేశంలో పలు సమస్యల నివారణ కోసం.. చాలా కాలంగా ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పురుషుల్లో బలహీనత, లైంగిక శక్తి లేకపోవడం, మానసిక ఒత్తిడి, శరీర అలసట వంటి సమస్యలలో ఇది చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది..

పోషకాల నిధి..

US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. కౌంచ్ విత్తనాలను శాస్త్రీయ భాషలో మకునా ప్రూరియన్స్ అని పిలుస్తారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఈ మూలకాలన్నీ కలిసి శరీరం బాగా పెరగడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే ప్రోటీన్ శరీర కండరాలకు బలాన్ని ఇస్తుంది.. ఇది బలహీనత, అలసట, సోమరితనాన్ని తొలగిస్తుంది. అదే సమయంలో, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.. ఇంకా మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కౌంచ్ విత్తనాలలో లభించే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న హానికరమైన అంశాలను తొలగిస్తాయి.. రోగనిరోధక శక్తిని కూడా మరింతగా బలోపేతం చేస్తాయి.

దీన్ని ‘సహజ వయాగ్రా’ అని ఎందుకు పిలుస్తారు?

ఆయుర్వేద గ్రంథాలలో, ఈ కౌంచ్ విత్తనాన్ని పురుషుల్లో లైంగిక సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. వాజికరణ, అకాల స్ఖలనం, స్పెర్మ్ లేకపోవడం, తక్కువ నాణ్యత కలిగిఉండటం వంటి సమస్యలకు చికిత్స చేయడంలో ఇది ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఈ విత్తనం స్పెర్మ్ సంఖ్య.. నాణ్యత రెండింటినీ పెంచడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని సమతుల్యం చేస్తుంది.. ఇది లిబిడోను కూడా పెంచుతుంది. అందుకే దీనిని ‘సహజ వయాగ్రా’ అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

మానసిక ఆరోగ్యానికి మంచిది

కౌంచ్ విత్తానాలు లైంగిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.. ఇందులో ఒత్తిడి, ఆందోళన – మానసిక అలసటను తగ్గించడంలో సహాయపడే కొన్ని అంశాలు ఉన్నాయి. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.. మెదడు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. మెదడుకు చాలా ముఖ్యమైన డోపమైన్ అనే రసాయనాన్ని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున, పార్కిన్సన్స్ వంటి నరాల వ్యాధులలో కూడా కౌంచ్ విత్తనం సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి.

దీనితో పాటు, కౌంచ్ విత్తనాలు శరీర బలం, శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ కష్టపడి పనిచేసేవారికి లేదా త్వరగా అలసిపోయినట్లు అనిపించే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది.. రోజంతా తాజాగా ఉంచుతుంది. క్రీడలు లేదా వ్యాయామంలో పాల్గొనే వ్యక్తులు దీనిని తీసుకోవడం ద్వారా వారి బలం.. పనితీరును కూడా పెంచుకోవచ్చు. అలాగే.. కౌంచ్ విత్తనాలు ఆర్థరైటిస్, గుండె సమస్యలతో కూడా మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కౌంచ్ విత్తనాలను ఉడకబెట్టడం లేదా వేయించడం ద్వారా తీసుకోవచ్చు.. అలాగే.. కౌంచ్ విత్తనాలను పౌడర్ రూపంలో కూడా తీసుకోవచ్చు.. తేనె లేదా పాలతో తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న