Basil Leaves: తులసి ఆకులను నమిలి తినవద్దు..! అలా చేస్తే ఏం జరుగుతుంది..? తెలుసుకోండి..
Basil Leaves: తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. ప్రజలు తులసిని వివిధ రకాలుగా వినియోగిస్తారు. కానీ తులసి ఆకులు తినడంపై
Basil Leaves: తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. ప్రజలు తులసిని వివిధ రకాలుగా వినియోగిస్తారు. కానీ తులసి ఆకులు తినడంపై పెద్ద చర్చ నడుస్తోంది. చాలా మంది చెప్పినట్లుగా తులసి ఆకులను నమిలి తినకూడదు. ఎందుకంటే ఇది దంతాలను పాడు చేస్తుంది. ఇదే సమయంలో కొందరు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే తులసి ఆకులను తినడానికి సరైన మార్గం ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటి, వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
ఎలా తినాలి..? రాత్రిపూట నాలుగు నుంచి ఐదు తులసి ఆకులను బాగా కడిగి ఒక గిన్నెలో నీటితో పాటుగా నానబెట్టాలి. ఉదయం పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగాలి. లేదంటే ఆకులలో పాటు నీటిని మరిగించండి, తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి టీ లాగా తాగండి.
ఎందుకు నమలవద్దు..? తులసి ఆకులలో పాదరసం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రెండు నమిలినప్పుడు నోటిలో విడుదలవుతాయి. ఈ ఖనిజాలు మీ దంతాలను దెబ్బతీస్తాయి అంతేకాకుండా రంగు పాలిపోవడానికి కారణమవుతాయి. ఇది కాకుండా తులసి ఆకులు కొద్దిగా ఆమ్ల గుణం కలిగి ఉంటాయి. మన నోరు క్షార గుణం కలిగి ఉంటుంది కాబట్టి క్రమం తప్పకుండా తులసి ఆకులు తీసుకుంటే పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. అందువల్ల దీనిని నమలడం మంచిది కాదంటారు.
ఏ మార్గం సరైనది? తులసి ఆకులను నమలకూడదంటారు. కానీ తులసి ఆకుల నుంచి తీసిన తాజా రసాన్ని తరచుగా నోటి పూతలకు నివారణగా ఉపయోగిస్తారు. అంటే దీని రసం నోటికి మంచిదే కదా.. అటువంటి పరిస్థితిలో ఆకులను నమలడం ఎలా తప్పు అవుతుంది. ఇది కాకుండా వైద్యులు అనేక నివేదికలలో ‘తులసిలో పాదరసం ఏర్పడటం నిజమే కానీ ఇది దంతాలకు హానికరం కాదని చెప్పారు. పాదరసం వల్ల దంతాలకు నష్టం కలుగుతుందని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ వాటిని నమలవద్దు డైరెక్ట్‌గా మింగాలని కొంతమంది సూచిస్తున్నారు.