అదిరిపోయే చీజ్ పన్నీర్ రోల్స్ రెసిపీ మీకోసం.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు..!
చీజ్, పన్నీర్ కాంబినేషన్ తో చేసే బ్రెడ్ రోల్ రెసిపీ.. రుచికరమైన స్నాక్ మాత్రమే కాకుండా సులభంగా తయారు చేసుకోవచ్చు కూడా. కేవలం 30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ సూపర్ టేస్టీ రెసిపీని అందరూ ఇష్టపడతారు. సాయంత్రం టీ టైమ్‌కి లేదా స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ గా బాగా సరిపోతుంది.

చీజ్, పన్నీర్ కాంబినేషన్ తో చేసే ఈ బ్రెడ్ రోల్స్ సూపర్ టేస్టీగా ఉంటాయి. స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ కి లేదా సాయంత్రం వేళ చిల్ చేస్తూ స్నాక్ గా తినడానికి పర్ఫెక్ట్ రెసిపీ. మీకు నచ్చిన సాస్ లేదా చట్నీతో కలిపి తింటే రుచి మామూలుగా ఉండదు. అదిరిపోద్ది. ఈ రెసిపీకి కావాల్సిన పదార్ధాలు ఏంటో.. తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- పన్నీర్ – 200 గ్రాములు
- క్యాప్సికం (పెద్దది) – 1
- ఉల్లిపాయ (పెద్దది) – 1
- టమాటా (పెద్దది) – 1
- పచ్చి మిరపకాయలు – 4
- అల్లం – 1 చిన్న ముక్క (1 inch)
- కొత్తిమీర – ½ కప్పు
- చీజ్ (తురిమినది) – ½ కప్పు
- పాలు – ½ కప్పు
- బ్రెడ్ క్రంబ్స్ – 2 టేబుల్ స్పూన్లు
- బ్రెడ్ స్లైసులు – 8
- మిరియాల పొడి – ½ టీస్పూన్
- కారం పొడి – ½ టీస్పూన్
- జీలకర్ర పొడి – ½ టీస్పూన్
- అమ్చూర్ లేదా చాట్ మసాలా – ½ టీస్పూన్
- ఉప్పు – టేస్ట్‌కి సరిపడా
- నూనె – డీప్ ఫ్రై కోసం
తయారీ విధానం
ముందుగా రోల్స్ స్టఫింగ్ కోసం ఉల్లిపాయ, టమాటా (లోపల గింజలు తీసేసి), క్యాప్సికం, పన్నీర్, పచ్చిమిర్చి, అల్లం అన్నీ ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద బౌల్లో ఈ ముక్కలు, బ్రెడ్ క్రంబ్స్, కారం పొడి, జీలకర్ర పొడి, అమ్చూర్, మిరియాల పొడి, ఉప్పు వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్సింగ్ తోనే అసలు టేస్ట్ స్టార్ట్ అవుతుంది.
తర్వాత మెయిన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఇంకో బౌల్లో అర కప్పు పాలు, అర కప్పు నీళ్లు కలిపి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ ను ఆ పాల మిశ్రమంలో ముంచి రెండు చేతులతో గట్టిగా నొక్కి నీళ్లను పిండేయాలి. ఇలా పిండిన బ్రెడ్‌ను పల్చగా చేసి దాని మధ్యలో ముందుగా తయారు చేసుకున్న యమ్మీ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ పెట్టి జాగ్రత్తగా రోల్ లాగా చుట్టాలి. మిగిలిన బ్రెడ్ స్లైసులతో కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి.
ఇప్పుడు ఫైనల్ టచ్. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి.. ఆయిల్ బాగా వేడయ్యాక మంటను మీడియమ్ లో ఉంచి ఒక్కొక్కటిగా 3 నుంచి 4 రోల్స్‌ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేయించిన రోల్స్ ను టిష్యూ పేపర్ పై తీసి ఎక్స్‌ట్రా ఆయిల్ తీసేయాలి. చివరిగా వేడి వేడిగా ఈ రోల్స్ ను టమాటా కెచప్ లేదా చట్నీతో సర్వ్ చేసుకుంటే వాటికి వేరే లెవల్ టేస్ట్ వస్తుంది. ఇది డెఫినెట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ.




