AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chocolates: ఈ దేశ ప్రజలు చాక్లెట్ అంటే చెవి కోసుకుంటారు..! ఎందుకో తెలుసా..?

chocolates: ఆధునిక కాలంలో చాక్లెట్‌కి డిమాండ్ బాగా పెరిగింది. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిదని అందరూ నమ్ముతున్నారు. చాక్లెట్‌కు సంబంధించిన అనేక

Chocolates: ఈ దేశ ప్రజలు చాక్లెట్ అంటే చెవి కోసుకుంటారు..! ఎందుకో తెలుసా..?
Chocolates
uppula Raju
|

Updated on: Nov 27, 2021 | 7:57 PM

Share

chocolates: ఆధునిక కాలంలో చాక్లెట్‌కి డిమాండ్ బాగా పెరిగింది. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిదని అందరూ నమ్ముతున్నారు. చాక్లెట్‌కు సంబంధించిన అనేక విషయాలు కూడా ఇది నిజమేనని నిరూపిస్తున్నాయి. ఉదాహరణకు చాక్లెట్ తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. చాక్లెట్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చాక్లెట్ తింటే త్వరగా ముసలితనం రాదనే నమ్మకం ప్రజల్లో బలంగా నెలకొని ఉంది. అయితే చాక్లెట్ ఎక్కువగా ఏ దేశ ప్రజలు తింటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

చాక్లెట్‌ను ఎక్కువగా ఇష్టపడేవారు ఐరోపాలో నివసిస్తున్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చాక్లెట్లలో సగం పశ్చిమ యూరోప్, ఉత్తర అమెరికా మాత్రమే వినియోగిస్తాయి. చాక్లెట్‌ని ఇష్టపడే విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికీ మనకంటే ముందు ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లోని ప్రజలు చాక్లెట్ రుచి, సువాసనను చాలా ఇష్టపడతారు. ఇక్కడ ఒక వ్యక్తి సగటున 8 కిలోల చాక్లెట్ తింటాడు. ఇండియా, చైనా వంటి దేశాల గురించి చెప్పాలంటే ఇక్కడి జనాభా 130 కోట్లకు పైగా ఉంది. ఈ దేశాల్లో కూడా చాక్లెట్‌కు భారీ మార్కెట్ పెరుగుతోంది.

అలాగే చాక్లెట్ రుచిని భారతీయులు కూడా ఎక్కువగా కోరుకుంటారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చాక్లెట్ మార్కెట్లలో అగ్ర దేశాల్లో భారతదేశం పేరు వచ్చింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ చాక్లెట్‌కు డిమాండ్ పెరుగుతోంది. కేవలం 5 సంవత్సరాలలో దేశంలో చాక్లెట్ డిమాండ్ 50 శాతం పెరిగింది. నివేదికల ప్రకారం 2016లో దేశంలో 2.28 లక్షల టన్నుల చాక్లెట్లు వినియోగించారు. భారతదేశం, చైనాలలో వేగవంతమైన పట్టణీకరణ, మధ్యతరగతి ప్రజలు చాక్లెట్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే చాక్లెట్‌ వినియోగంలో చైనా ఇప్పటికీ వెనుకబడి ఉంది. ఇక్కడ తలసరి చాక్లెట్ వినియోగం కిలో కంటే చాలా తక్కువ. అయితే ఉన్నత వర్గాల ప్రజలు మాత్రం చాక్లెట్ల కోసం విపరీతంగా షాపింగ్ చేస్తుండటం విశేషం.

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

అర్ధరాత్రి వరకు మొబైల్‌ స్క్రీన్‌ చూస్తున్నారా.. అయితే ఆ కోరికలు పెరుగుతున్నాయట..!

భారత్‌, బంగ్లాదేశ్ మధ్య ప్రవహించే నది గురించి మీకు తెలుసా.. ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే..?