Chili Powder: ఒంట్లో వెటకారం ఎక్కువైనా పర్లేదు.. కారం ఎక్కువైతే మాత్రం ఖేల్ ఖతం
కారం మితంగా తీసుకుంటే ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అతిగా తీసుకుంటే అన్ని నష్టాలు కలుగుతాయి. ఎక్కువగా కారం తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Side Effects Of Red Chilli Powder: ఏది తిన్నా.. నోటికి కాస్తంత రుచి తగలాలంటే ఉప్పు, కారం తప్పనిసరి.. కొంతమంది నాది ఫలానా ఏరియా.. మా దగ్గర కారం గట్టిగా తింటాం అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే మీరు ఎక్కువ తినగలరేమో గానీ, అది ఆరోగ్యానికి అయితే మంచిది కాదు. కారం మితంగా తీసుకుంటే ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అతిగా తీసుకుంటే అన్ని నష్టాలు కలుగుతాయి. ఎక్కువగా కారం తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి శారీరక శ్రమ లేని ఈ కాలంలో కారం ఆరోగ్యం పాలిట యమపాశం అనే చెప్పుకోవాలి. పచ్చి మిర్చి, ఎండు మిర్చి, లేదా ఎండు కారం ఏదయినా కారం చేసే చేటు గూర్చి అనర్థాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
- కారం ఎక్కువగా తినడం వల్ల అసిడిటీ, గ్యాస్ సమస్యలు వెంటాడతాయి
- ఇంద్రియ వికారాలు అధికంగా సంభవిస్తాయి.
- బలహీనత, మూర్ఛ, మైకము మొదలగు వికారాలు కలుగుతాయి.
- కారం తీసుకోవడం ఎక్కువయ్యేకొద్దీ గొంతు, కడుపులో మంటతో పాటు పలు ఆకస్మిక వ్యాధలు వెంటాడే అవకాశం
- కారం వల్ల కొందరికి విపరీతమైన గ్యాస్ వస్తే, ఇంకొందరికి అజీర్తి మొదలవుతుంది
- కారంపొడి ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటిపూత వచ్చే అవకాశం ఉంది
- గర్భధారణ సమయంలో ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల శిశువుకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే చాన్స్
- కారంపొడిని ఎక్కువగా తింటే కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదం.. కొందరకి కడుపులో పుండ్లు కూడా ఏర్పడతాయి
- ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.
Also Read: కొబ్బరి నీళ్లు కాదు.. అమృత వర్షిణి అనడం బెటరేమో.. సమ్మర్ లో సాలిడ్ బెనిఫిట్స్ గురూ..!
‘మత్స్యకన్య’ ! కోతి-చేప కలయికే కారణమా..? మతి పోగొట్టే విషయాలు !