AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఆరోగ్యానికి మంచిదని వీటిని అతిగా తింటున్నారా.. అయితే, ఈ వ్యాధుల బారిన పడే ఛాన్స్..

Kiwi Fruit: ఈ పండును తినడం వల్ల ప్లేట్‌లెట్స్ చాలా వేగంగా పెరుగుతాయని, జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుందని వైద్యులు ఎల్లప్పుడూ సలహా ఇస్తుంటారు. అయితే మీరు కీవీని ఎక్కువగా తింటే మాత్రం ఈ రోగాల బారిన పడే ఛాన్స్ ఉంది.

Health Tips: ఆరోగ్యానికి మంచిదని వీటిని అతిగా తింటున్నారా.. అయితే, ఈ వ్యాధుల బారిన పడే ఛాన్స్..
Kiwi Side Effects
Venkata Chari
|

Updated on: Mar 14, 2022 | 9:36 PM

Share

సూపర్‌ఫుడ్‌గా పిలిచే కీవీ(kiwi fruit) ఫ్రూట్.. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ప్రతి పండులో కొన్ని అవసరమైన ఖనిజాలు, విటమిన్లు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. కీవీ పండు ప్లేట్‌లెట్లను పెంచడంతో పాటు రోగనిరోధక శక్తిని, జీర్ణవ్యవస్థను కూడా సక్రమంగా ఉంచడంలో సహాపడుతోంది. అయితే, ప్రయోజనకరంగా భావించి అవసరానికి మించి తింటుంటే మాత్రం.. ఈ పండు వల్ల హాని(Health) కూడా చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కీవీ ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీర వాపు- కీవీ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వాపులు వచ్చే ప్రమాదం ఉంది. కీవీకి అలెర్జీ ప్రతిచర్య కారణంగా శరీరం వాపులు వస్తాయి. శరీరంలోని ప్రతిరోధకాలు కీవీని అతిగా తీసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నట్లయితే, వెంటనే కీవీని తినడం మానేసి వైద్యుడిని సంప్రదించడం మంచింది.

అలర్జీలు- కీవీ ఎక్కువగా తినడం వల్ల కొందరిలో వికారం లేదా వాంతులు వస్తాయి. ఎలర్జీ వల్ల ఏదో ఒకటి తినడం వల్ల ఇబ్బంది పడటం చాలా సార్లు కనిపిస్తుంది.

ప్యాంక్రియాస్‌లో వాపు- కివీస్ ఎక్కువగా తినడం వల్ల కూడా తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ సమస్య వస్తుంది. ఈ సమస్యలో, ప్యాంక్రియాస్‌లో వాపు ఉండవచ్చు. ఇది పొత్తికడుపు నొప్పికి కూడా కారణమవుతుంది. అయితే కడుపు నొప్పి కొన్ని రోజుల్లో మరింత ఎక్కువయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచింది.

ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్- కీవీలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని వైద్యులు కూడా సలహా ఇస్తారు. అయినప్పటికీ, అధిక మోతాదులో తీసుకోవడం పిల్లల మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. దీని అధిక వినియోగం వల్ల పుట్టబోయే బిడ్డకు ఆస్తమా, ఆటిజం వంటి వ్యాధులు కూడా వస్తాయి. ఇటువంటి పరిస్థితిలో, గర్భధారణ సమయంలో మహిళలు పరిమిత పరిమాణంలో కీవీని తీసుకోవాలని సలహా ఇస్తారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులను కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.

Also Read: Health Tips: మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? అయితే, వీటిని అస్సలు తినొద్దు.. కాదని తిన్నారంటే అంతేసంగతులు!

Onions Side Effects: నిత్యం ఉల్లి లేనిదే ముద్ద దిగడం లేదా.. అయితే ఈ సమస్యలున్నవారు తింటే కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నట్లే