AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? అయితే, వీటిని అస్సలు తినొద్దు.. కాదని తిన్నారంటే అంతేసంగతులు!

Health Tips: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. మంచి, చెడ్డ అనే తేడా లేకుండా సమయానికి ఏది దొరికితే..

Health Tips: మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? అయితే, వీటిని అస్సలు తినొద్దు.. కాదని తిన్నారంటే అంతేసంగతులు!
Healthy Food
Shiva Prajapati
|

Updated on: Mar 14, 2022 | 9:09 PM

Share

Health Tips: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. మంచి, చెడ్డ అనే తేడా లేకుండా సమయానికి ఏది దొరికితే అది తింటూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ చెడు ఆహారపు అలవాట్ల కారణంగా.. కిడ్నీలో, పిత్తాయశంలో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్రమైన కడుపు నొప్పితో అవస్థలు పడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. పిత్తాశయం(గాల్ బ్లాడర్‌)లో రాళ్ల సమస్య ఉంటే.. సర్జరీ ద్వారానే బయటకు తీయాల్సి ఉంటుంది. సకాలంలో రాళ్లను తొలగించకపోతే.. అది లివర్ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఈ ఇన్‌ఫెక్షన్ కారణంగా, పెద్ద ప్రేగు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కిడ్నీలోనూ పెద్ద రాళ్లు ఏర్పడినట్లయితే.. అది కూడా శస్త్ర చికిత్స ద్వారా మాత్రమే తొలగించడం జరుగుతుంది.

అయితే.. మెడిసిన్స్, సహజ ఆహారం ద్వారా గాల్‌బ్లాడర్, కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించవచ్చు. ముఖ్యంగా రాళ్ల సమస్య ఉన్న సమయంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చాలా సార్లు ప్రజలు వాటిని విస్మరిస్తుంటారు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కిడ్నీ, లివర్‌లో రాళ్లు ఏర్పడితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తినకూడదు? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ పండ్లు తినండి.. నీరు అధికంగా ఉండే పండ్లు: కిడ్నీ, లివర్‌లో రాళ్లు ఏర్పడి ఇబ్బందులు పడుతున్నట్లయితే.. నీరు ఎక్కువగా ఉండే పండ్లను తినండి. రాళ్లను తొలగించడానికి వైద్యులు ఎక్కువ నీరు త్రాగాలని సిఫార్సు చేస్తుంటారు. నీళ్లు తక్కువగా తాగే వారికి రాళ్ల సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి. కిడ్నీలో, లివర్‌లో రాళ్ల సమస్య తొలగించుకోవడానికి పుచ్చకాయ జ్యూస్, సీతాఫలం, కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. పుచ్చకాయ గింజలను మాత్రం అస్సలు తినవద్దు.

సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి రాళ్లను కరిగిస్తుందని, రాళ్ల సమస్యతో ఇబ్బందులు పడేవారు వీటినీ తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు వీటిలో ఉండే సిట్రిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే నారింజ, సీజనల్ పండ్లు, జామ, ద్రాక్షలను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఈ పండ్లు రాళ్ల సమస్యను దూరం చేయడమే కాకుండా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.

కాల్షియం అధికంగా ఉండే పండ్లు: కివీ, నల్ల ద్రాక్ష, అత్తి పండ్ల వంటి కాల్షియం అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. కాల్షియం రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు.. కాల్షియం అధికంగా ఉండే ఇతర ఆహార పదార్థాలను కూడా తీసుకోవచ్చు.

ఈ పండ్లను అస్సలు తినవద్దు.. చాలా సార్లు ప్రజలు కిడ్నీలో, లివర్‌లో రాళ్లు ఏర్పడి ఇబ్బందులు పడుతున్నప్పుడు అవగాహన లేకుండా ప్రతీ పండ్లను తింటారు. అయితే, రాళ్ల సమస్యతో బాధపడే వారు కొన్ని రకాల పండ్లను అస్సలు తినొద్దని చెబుతున్నారు వైద్య నిపుణులు. దానిమ్మ, బత్తాయి, మామాడి, డ్రై ఫ్రూట్స్ అస్సలు తినకూడదని సూచిస్తున్నారు. ఈ పండ్లను పొరపాటుగా తింటే.. రాళ్ల సమస్య పెరుగుతుందంటున్నారు. ఇంకా ముఖ్యంగా ప్యాకింగ్ ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దని స్పష్టం చేస్తున్నారు.

Also read:

Viral Video: పాపం ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ ప్రధానిని ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటున్న నెటిజన్లు..

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. ప్రజలకు అందుబాటులోకి మరో..

Samsung Galaxy M53 5G: శామ్‌సంగ్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్.. లీకైన వివరాలు.. ఫీచర్స్ చూస్తే వావ్ అంటారు..!